రాహల్ కావాలి కానీ కాంగ్రెస్ అక్కర్లేదా?

Update: 2016-01-31 06:39 GMT
కొన్న అంశాలు చాలా చిత్రంగా ఉంటాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఉదంతంపై దేశంలో మరే రాజకీయ పక్షానికి లేని విధంగా.. ఏ జాతీయ నాయకుడూ ఇవ్వనంత ప్రాధాన్యతను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవ్వటం తెలిసిందే. ఇప్పటివరకూ దేశాన్ని చాలానే సమస్యలు వెంటాడి వేధించినా ఏ విషయ మీదా రోడ్డు మీదకు వచ్చి దీక్ష చేయని ఆయన.. రోహిత్ ఆత్మహత్య విషయంలో ఏకంగా ఎనిమిది గంటల పాటు దీక్ష చేసి చాలామందిని ఆశ్చర్యపరిచారు.

రాహుల్ లాంటి నేత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి ఆందోళన చేస్తుంటే.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఊరుకుంటారా? మేము సైతం అంటూ వారు వచ్చారు. అయితే.. వారిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ ఇష్యూ మీద ఆందోళన చేస్తున్న వారు మాత్రమే కాదు.. రాహుల్ గాంధీ సైతం ఈ ఇష్యూలోకి ఎంటర్ కావద్దని చెప్పటం గమనార్హం.

రోహిత్ ఇష్యూను రాహుల్ పర్సనల్ గా టేకప్ చేశారా? కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా చేశారా? అన్న సందేహం తాజా చర్యతో రావటం ఖాయం. ఈ విషయం మీద కాంగ్రెస్ యువరాజు కాస్తంత క్లారిటీ ఇస్తే బాగుంటుంది.
Tags:    

Similar News