పవన్ ఇప్పుడు ఒంటరా..?

Update: 2017-02-15 10:02 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీకి అధినేత. లక్షలాది మంది అభిమానులున్న కథనాయకుడు.. బ్రహ్మాండమైన మెగా  కుటుంబం నుంచి వచ్చిన హీరో...  వ్యక్తిగతంగానూ కుటుంబాలున్నాయి.  అలాంటప్పుడు ఇంకా ఆయన ఒంటరి కావడం ఏంటనుకుంటున్నారా.. రాజకీయ పరిస్థితులు చూస్తుంటే అలానే ఉన్నాయి. గత ఎన్నికల్లో పవన్ ను ఫుల్లుగా వాడుకున్న టీడీపీ - బీజేపీలు ఇప్పుడు ఆయన్ను పక్కన పెట్టేశాయి.  సహజంగానే ఆ పార్టీల అనుకూల మీడియాలూ పవన్ వార్తలను కనీకనిపించకుండా తొక్కేస్తున్నాయ్..  ఇది చాలదన్నట్లు ఆయన రాజకీయ పార్టీ పెట్టేవరకు వెన్నంటే ఉన్న ఇద్దరు కీలక వ్యక్తులు ఆయనకు దూరమయ్యారని తెలుస్తోంది.  కొద్దికాలంగా జనసేన కార్యకలాపాల్లో వారు కనిపించకపోవడంతో ఈ అనుమానాలు వినిపిస్తున్నాయి.
    
సినీ నిర్మాత, వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) రాజు రవి తేజ్.. ఈ ఇద్దరూ జనసేన ఆవిర్భావం వెనుక ఉన్నారు. 2014లో జనసేన ఆవిర్భవించేటప్పుడు పవన్ పక్కనే ఉన్నారిద్దరూ. రాజు రవితేజ్ అయితే పవన్ రాసిన ఇజం పుస్తకానికి సహ రచయిత కూడా.  పీవీపీ కూడా అంతే. పవన్ కు వెన్నుదన్నుగా ఉండేవారు. దీంతో జనసేన కార్యకలాపాల్లో ఈ ఇద్దరూ భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తారని అంతా అనుకున్నారు. కానీ.. అలా జరగలేదు. జనసేన నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఈ ఇద్దరూ కనిపించడం లేదు. అంతేకాదు.. పవన్ వెంట వీరు ఎక్కడా లేరు. దీంతో పవన్ తో ఈ ఇద్దరికీ చెడిందని టాక్.
    
అయితే.. పవన్ కు వీరు దూరంగా ఉన్నా వీరు మాత్రం దోస్తానా మెంటైన్ చేస్తున్నారట. తాజాగా రానా నటించి ఘాజీ సినిమా ప్రివ్యూకు వీరిద్దరూ వచ్చారు. మరి.. పవన్ కు, వీరికి ఎందుకు చెడిందన్నది మాత్రం తెలియడం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News