ఢిల్లీలో జంబలకడి పంబ

Update: 2015-10-03 11:51 GMT
నిర్భయపై అత్యాచారంతో ఢిల్లీని ప్రపంచమంతా అత్యాచారాల నగరమని అంటోంది. మహిళలకు అక్కడ రక్షణ లేదని భయపడుతున్నారు. మహిళలేం ఖర్మ అక్కడ పురుషుల మానప్రాణాలకూ రక్షణ లేదని గణాంకాలు చెబుతున్నాయి. మగాడిని నాకేమవుతుందని ఎక్కడపడితే అక్కడ ధైర్యంగా తిరిగితే వారి పని అయిపోయినట్లేనట.... నిర్మానుష్య ప్రాంతాలు, రాత్రివేళల్లో మగవాళ్ల శీలం కూడా పోతుందట.... ఇదేదే హోమో సెక్సువల్స్ చేస్తున్న లైంగిక దాడులు - అత్యాచారాలు అనుకుంటే పొరపాటే... మహిళలే పురుషులను రేప్ చేస్తున్నారట... గ్యాంగ్ రేప్ చేస్తున్నారట.

ఇటీవల ఢిల్లీలోని ఓ కాల్ సెంటర్ కు వస్తున్న ఫోన్ కాల్స్ విని అధికారులు బెంబేలెత్తుతున్నారు. ఢిల్లీకి ఏమయింది అనుకుంటున్నారు. ''సార్.... నన్ను గ్యాంగ్ రేప్ చేశారు... బట్టలన్నీ విప్పేసి నగ్నంగా వీడియో తీసి బెదిరించి లొంగదీసుకున్నారు.. బెల్ట్‌ లతో కొట్టారు... గుప్త ప్రదేశాల్లో గాయాలు చేశారు..." అంటూ  పురుషుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయట. వీరంతా  మహిళల నుంచి లైంగిక హింస ఎదుర్కొంటున్న బాధితులే. ఢిల్లీలో మహిళల చేతిలో లైంగిక హింసకు, లైంగిక దోపిడీకి గురవుతున్న పురుషుల సంఖ్య పెరిగితపోతోందని ఒక స్వచ్ఛంద సంస్థ తన నివేదిక లో పేర్కొంది.

 సేవ్ ఇండియన్ ఫ్యామిలీ  అనే పేరుతో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న హెల్ప్‌ లైన్ కు పెద్ద సంఖ్యలో ఇలాంటి కాల్స్ వస్తున్నాయట. సగటున వంద  కాల్స్ వస్తే అందులో సుమారు 70 పురుషుల నుంచి వస్తున్నవే. ఎక్కువగా 18 నుంచి 20 ఏళ్లలోపు యువకులే బాధితులని తేలింది.

అయితే... వీటిలో కొన్ని నిజాలున్నా కొన్ని మాత్రం ఫేక్ కాల్స్ కావొచ్చంటున్నారు. ఇంకొన్ని పెళ్లయిన మగవాళ్ల నుంచి కూడా వస్తున్నాయి... ఆస్తి రాయని కారణంగా దాడులు చేయడం... లైంగిక హింసకు గురిచేయడం చేస్తున్నారని తమ భార్యలపై భర్తలు ఫిర్యాదు చేస్తున్నారు. లైంగిక దాడులు - వరకట్న వేధిపులు - పని చేసే చోట లైంగిక వేధింపులనెదుర్కొంటున్న  మహిళల కోసం చట్టాలున్నాయికానీ, వేధింపులకు గురవుతున్నామని పురుషుల కోసం ఏ చట్టాలూ లేకపోవడంతో వాళ్లలోనూ ఆత్మహత్యల సంఖ్య పెరుగుతోందంటున్నారు. మొత్తానికి ఢిల్లీలో జంబలకడి పంబ బాగానే ఉన్నట్లుంది.
Tags:    

Similar News