జడ్జిలపైనా కేంద్రం నిఘా?

Update: 2016-10-31 09:45 GMT
 ఢిల్లీ ముఖ్యమంత్రి - ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై సంచలన ఆరోపణ చేశారు. ఢిల్లీ హైకోర్టు 50వ వార్షికోత్సవం జరుపుకొంటున్న నేపథ్యంలో కేజ్రీవాల్ కేంద్రంపై ఈ ఆరోప‌ణ‌లు చేశారు. ఇటీవ‌లే హైకోర్టు జడ్జిల సంఖ్య విషయంలో సుప్రీంకోర్టు కేంద్రాన్ని విమ‌ర్శించడంతో తాజాగా కేజ్రీవాల్ అగ్నికి ఆజ్యం పోసేలా వ్యాఖ్యలు చేశారు. జడ్జీల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని ఆయన కలకలం రేపారు.

ఇద్దరు న్యాయమూర్తులు మాట్లాడుకుంటూ.. ఫోన్లో సంభాషణలు వద్దని.. అవి ట్యాప్ అవుతున్నాయని అనుకుంటుండగా తాను ఓ జడ్డి వద్ద ఉండి విన్నానని.. ఇది నిజమే అయితే - అంతకన్నా ప్రమాదకర పరిస్థితి మరొకటి ఉండదని అన్నారు. ఇండియాలో న్యాయవ్యవస్థకు స్వాతంత్ర్యం లేకపోయిందని, జడ్జీలు తప్పు చేసిన పక్షంలో కూడా సాక్ష్యాల సేకరణకు వేరే మార్గాలు వాడుకోవాలే తప్ప ఫోన్లపై నిఘా ఉంచరాదని అన్నారు.

కేజ్రీవాల్ చేసిన ఈ ఆరోపణలను కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖండించారు. తాను రెండేళ్లుగా సమాచార శాఖ మంత్రిగా ఉన్నానని కేజ్రీవాల్ చేసిన ఆరోప‌ణ‌లు అస‌త్యమ‌ని చెప్పారు. న్యాయ‌వ్యవ‌స్థ స్వతంత్రంగా వ్యవ‌హ‌రించాల‌నేదే కేంద్రం ల‌క్ష్యమ‌ని ఆయ‌న అన్నారు. ఇంతవరకు ఎన్నడూ జడ్జిల ఫోన్లు ట్యాప్ చేయలేదని ఆయన చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News