అక్క‌డెంత బిజీగా ఉన్నా...ఆ విష‌యంలో త‌గ్గేదేలే!

Update: 2022-10-08 07:43 GMT
మాస్ రాజా ర‌వితేజ క‌మిట్ మెంట్ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. బ్యాక్ టూ బ్యాక్ కొత్త ప్రాజెక్ట్ ల్ని లైన్ లోకి తెస్తు..టాలీవుడ్ లో ఏ  హీరో! నా అంత బిజీగా లేరు అనిపిస్తున్నాడు. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా రాజా క‌మిట్ మెంట్ల‌లో  మెరుపువేగం క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం 'రావ‌ణాసూర‌'..'ధ‌మాకా'..'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు' చిత్రాలు సెట్స్ లో ఉన్నాయి.

వీటితో పాటు మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న  'వాల్తేరు వీర‌య్య‌'లోనూ కీల‌క‌ పాత్ర పోషిస్తున్నాడు. ఇవి గాక కార్తీక్ ఘ‌ట్ట‌మేనితో..సంప‌త్ నంది సినిమాల‌కు క‌మిట్ అయ్యాడు. ప్ర‌స్తుతం ఈ రెండు సినిమాల‌కు సంబంధించి  మేక‌ర్స్ హీరోయిన్ల వేట‌లో ఉన్నారు.  వాళ్ల‌తో పాటు ర‌వితేజ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు.

రాజా ఆయా చిత్రాల హీరోయిన్ల ఎంపిక విష‌యంలోనూ త‌గ్గేదేలే అంటున్నాడు. తాజా క‌మిట్ మెంట్స్ లో ఓ చిత్రానికి గాను  'ఏక్ మినీ క‌థ' ఫేం కావ్యా థాప‌ర్ ని ఎంపిక చేయ‌డంలో ర‌వితేజ కీల‌క పాత్ర పోషించిన‌ట్లు స‌మాచారం. అలాగే అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్..ప్రియాంక అరుల్ మోహ‌న్.. స‌హా కొంత మంది కొత్త భామ‌ల‌  పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ల తుది ఎంపిక ర‌వితేజ చేతుల్లోనే ఉంద‌ని  గుస గుస వినిపిస్తుంది.

ద‌ర్శ‌కులు  కొంత‌ మంది హీరోయిన్ల‌ను అనుకుని..వాళ్ల వివ‌రాలు ర‌వితేజ‌కి ఎప్ప‌టిక‌ప్పుడు చేర‌వేస్తున్నారుట‌. వాళ్లంద‌ర్నీ షార్ట్ లిస్ట్ చేసి  వాళ్లలో  ఒక‌రి పేరుని రాజా సూచిస్తున్నాడుట‌. ఓవైపు ఆన్ సెట్స్ లో ఉన్న చిత్రాల‌తో బిజీగా ఉంటూనే..హీరోయిన్ల ఎంపిక లోనూ ర‌వితేజ  ఇలా కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇలా ఛాయిస్ తీసుకోవడం ర‌వితేజ‌కి కొత్తేం కాదు.

స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ అయిన త‌ర్వాత ర‌వితేజ స‌ర‌స‌న ఏ హీరోయిన్ ఎంపిక చేయాలి? అన్న‌ది తుది నిర్ణ‌యం రాజానే తీసుకుంటారు అని ఎప్ప‌టి నుంచో వినిపిస్తున్న‌దే. ఈ విష‌యంలో ద‌ర్శ‌కుల భాగ‌స్వామ్యం  కొంత‌వ‌ర‌కే ప‌రిమితమ‌ని నెట్టింట ప్ర‌చారం ఎప్పుడూ హాట్ టాపిక్ నే.  

సీనియ‌ర్ డైరెక్ట‌ర్లు  మిన‌హా కొత్త ద‌ర్శ‌కుల‌తో ర‌వితేజ సినిమాలు చేస్తే..ఇదే విధానం కొన‌సాగుతుంద‌ని గ‌తంలోనే వార్తలొచ్చాయి. మ‌రోసారి అదే స‌న్నివేశం  క‌నిపిస్తుంది. మ‌రి అప్ క‌మింగ్ ప్రాజెక్ట్ ల్లో మాస్ రాజా ఎవ‌రెవ‌రికి ఛాన్స్  ఇస్తారు? అన్న‌ది చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News