సోము వీర్రాజు వెనుక ఉన్న‌దెవ‌రు?

Update: 2017-12-27 08:36 GMT
ఇద్ద‌రు ఫ్రెండ్స్ మ‌ధ్య గొడ‌వ‌లు ఎందుకు వ‌స్తాయి? ఒకరి స‌న్నిహితుడో.. ద‌గ్గ‌రివాడో.. తెలిసినవాడో చెప్పే మాట‌లో.. అసంతృప్తో.. ఇంకెదైనా పెద్ద విష‌య‌మో ఉంటుంది. ఇప్పుడు ఏపీ అధికార‌ప‌క్ష‌మైన టీడీపీ.. మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ మ‌ధ్య ప‌రిస్థితి కూడా ఇంచుమించు ఇదే రీతిలో ఉంద‌ని చెప్పాలి. సాధార‌ణంగా జాతీయ పార్టీలతో మిత్ర‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించే ప్రాంతీయ పార్టీలు త‌మ మాట‌ల‌తో.. చేష్ట‌ల‌తో చిరాకు పుట్టిస్తుంటాయి. ఆనీ.. ఇక్క‌డ సీన్ రివ‌ర్స్. ప్రాంతీయ పార్టీ అయిన టీడీపీపై త‌ర‌చూ జాతీయ పార్టీకి చెందిన ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు విమ‌ర్శ‌లు చేస్తుంటారు.

టైం చూసుకొని బాబును కెల‌క‌టంతో సోము త‌ర్వాతే ఎవ‌రైనా స‌రే. మామూలుగా ఇదే త‌ర‌హా వ్యాఖ్య‌లు మిత్ర‌ప‌క్షంగా ఉన్న మ‌రే ఇత‌ర ప్రాంతీయ పార్టీ అయినా స‌రే.. త‌మ అధినేత‌ను చికాకు పెడుతున్న నేత‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతారు. కానీ.. ఏపీ అధికార‌ప‌క్ష అధినేత చంద్ర‌బాబు తీరు కాస్త భిన్నంగా ఉండ‌టంతో మాట‌ల యుద్ధం ఒక‌వైపు నుంచి మాత్ర‌మే ఉంది.

ఏదో ఒక కార‌ణాన్ని చూపించి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మీద‌నో.. టీడీపీ పార్టీతో త‌మ‌కున్న పొత్తు మీద‌నే త‌ర‌చూ కామెంట్లు చేస్తుంటారు సోము. రెండు రాష్ట్రాల్లో జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డైన నేప‌థ్యంలో సోము మాట్లాడుతూ చంద్ర‌బాబు మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి డ‌ప్పు వాయించిన సోము.. ఉత్సాహంతో నృత్యం చేయ‌ట‌మే కాదు.. బీజేపీతో పొత్తు వ‌ద్ద‌ని బాబుకు చెప్పాల‌న్న పెద్ద మాట‌ను కూడా అనేశారు.

ఎలాంటి ఇబ్బందులు లేకుండా పొత్తులు సాగుతున్న వేళ‌.. ఒక పార్టీ ముఖ్య‌నేత అన‌వ‌స‌రంగా మాట్లాడిన‌ప్పుడు.. జాతీయ స్థాయి నేత‌లు రియాక్ట్ అయి స‌ద‌రు నేత నోటికి తాళం వేయాలి. కానీ.. సోము విష‌యంలో అలా క‌నిపించ‌దు. త‌మ అధినేత‌ను ఉద్దేశించి ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడుతున్న నేప‌థ్యంలో టీడీపీ నేతలు ఒక‌రిద్ద‌రు సోముపై తీవ్ర‌స్థాయిలో విరుచుక‌ప‌డ్డారు. ఆశ్చ‌ర్యంగా బాబు వెంట‌నే స్పందించి.. సోము ఏం మాట్లాడినా చూసిచూడ‌న‌ట్లు ఉండాలే కానీ.. స్పందించొద్ద‌ని చెప్ప‌టం క‌నిపిస్తుంది.

ఎందుక‌లా అంటే.. సోము వ్యాఖ్య‌ల‌పై బాబు అలెర్ట్ కావ‌ట‌మే కాదు.. అత‌డి వెనుక ఉన్న శ‌క్తి ఏమిట‌న్న విష‌యంపై ఆరా తీసిన‌ట్లుగా చెబుతున్నారు. బీజేపీ అధినాయ‌క‌త్వ‌మే సోము చేత అలా మాట్లాడిస్తున్న‌ట్లుగా వ‌స్తున్న స‌మాచారంలో నిజం లేద‌ని.. సోము వెనుక సంఘ్ ప‌రివార్ ఉన్న‌ట్లుగా బాబు గుర్తించిన‌ట్లు చెబుతున్నారు. బీజేపీ.. బాబుల మ‌ధ్య సంబంధం  విష‌యంలో  సంఘ్ మొద‌టి నుంచి అసంతృప్తితోనే ఉంది. ఏపీలో బీజేపీ సొంతంగా ఎద‌గ‌టానికి బాబు అడ్డుకుంటున్నార‌ని.. బాబు నీడ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తే త‌ప్పించి బీజేపీ ఎదిగే అవ‌కాశం లేద‌న్న‌ది సంఘ్ పెద్ద‌ల బావ‌న‌గా చెబుతున్నారు.

నంద్యాల‌.. కాకినాడ‌ల‌లో టీడీపీ విజ‌యం నేప‌థ్యంలో వెన‌క్కి త‌గ్గిన సంఘ్‌.. తాజాగా రెండు రాష్ట్రాల్లో బీజేపీ విజ‌యం నేప‌థ్యంలో సోము ద్వారా త‌మ మ‌న‌సులోని మాట‌ను చెప్పించిన‌ట్లుగా చెబుతున్నారు. బాబుపై సోము తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన వెంట‌నే రియాక్ట్ అయిన త‌మ్ముడికి మాట్లాడొద్ద‌న్న బాబు.. మాట‌ల వెనుక ఉన్న విష‌యం ఏమిటో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. బీజ‌పీ పెద్ద‌లు కాక‌.. సంఘ్ మాట్లాడించింద‌న్న విష‌యాన్ని గుర్తించిన బాబు.. ఇష్యూను అమిత్ షా టేబుల్ మీద పెట్టిన‌ట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. సంఘ్ కు ఇష్టం లేని ఫ్రెండ్ షిప్ బీజేపీ ఎక్కువ కాలం చేయ‌లేద‌న్న మాట వినిపిస్తోంది. అదే స‌మ‌యంలో.. త‌న‌ను మాట అంటున్న వారికి ధీటుగా రియాక్ట్ అవుతున్న వారిని కంట్రోల్ చేయ‌టం బాబుకే న‌ష్ట‌మ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మిత్రధ‌ర్మాన్ని పాటించే విష‌యంలో బీజేపీకి లేని నొప్పి టీడీపీకి ఎందుక‌న్న తెలుగు త‌మ్ముళ్ల మాట‌లు చూసిన‌ప్పుడు బాబు తీరుపై వారికున్న అసంతృప్తి ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు.
Tags:    

Similar News