టీ కాంగ్రెస్ లో ఇద్దరు బద్ధ శత్రువులు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి కలిశారు..
అవును వాళ్లిద్దరు కలిశారు.. తెలంగాణ కాంగ్రెస్ కేడర్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అరుదైన దృశ్యం శుక్రవారం కనిపించింది. దీంతో శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇక పార్టీ గాడిలో పడింది అని సంబరాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత కొంతకాలంగా అసంతృప్తితో కొనసాగుతున్న విషయం తెలిసిందే. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం నుంచి ఆయన సొంత పార్టీపైనే విమర్శలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేసే కార్యక్రమాలు పార్టీకి నష్టాన్ని తెస్తున్నాయని ఆరోపించారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం చాలా కూల్ గా రెస్పాండ్ అయ్యారు. ఆయన ఆరోపణలు అవాస్తవమని సమాధానమిచ్చేవారు. వీరి పరిస్థితిని చూసి ఇక జన్మల కలువరు అని అనుకున్నారు. కానీ ఇద్దరు కలిసి మాట్లాడుకునే ఫొటోలు బయటికి రావడంతో పార్టీ నాయకులు ఆశ్చర్యపోతున్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి రాష్ట్ర కాంగ్రెస్ కు గడ్డు రోజలు ఏర్పడ్డాయి. ఈ పార్టీపై అభిమానంతో కొందరిని ఎమ్మెల్యేలుగా గెలిచినా.. టీఆర్ఎస్ ఆకర్షణలో పడ్డారు. దీంతో కొందరు పదవులు, ఇతర అవకాశాలతో పార్టీని వదిలారు. 2018 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కొన్నిసీట్లు తెచ్చుకుంది. కానీ ఆ సమయంలో పార్టీకి సరైన నాయకుడు లేనందునే ఈ పార్టీలో కొనసాగలేమని అప్పుడు గెలిచిన వారు సైతం టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు. ఈ పరిస్థితిని బాగా గమనించిన ఢిల్లీ పెద్దలు పిసీసీ చీఫ్ ను మార్చాల్సిందిగా డిసైడ్ అయ్యారు. వెంటనే రేవంత్ రెడ్డికి పగ్గాలు ఇచ్చారు.
టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం కాంగ్రెస్ సీనియర్లకు నచ్చలేదు. వీహెచ్ హనుమంతరావు, పొన్నం ప్రభాకర్ లాంటి వారితో పాటు కోమటిరెడ్డి బ్రదర్స్ పరోక్షంగా విమర్శలు చేశారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు చీఫ్ పదవి ఇవ్వాలని ఢిల్లీలోనే కొంతకాలం మకాం వేశారు. ఆ తరువాత తనకు అవకాశం రాదని అనుకున్నా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఏదో రకంగా విమర్శలు చేస్తే వచ్చారు. అయితే కోమటిరెడ్డి వ్యాఖ్యలపై రైవంత్ రెడ్డి పైకి ఏమీ అనకపోయినా ఆయన సన్నిహితులు మాత్రం కౌంటర్లు ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ పరిస్థితి గందరగోళంగా మారింది.
కొన్ని రోజలు కిందట తమను వలసవాదులన్నారని రేవంత్ రెడ్డి వర్గం పార్టీ కమిటీకి రాజీనామా చేసింది. అటు సీనియర్లు సైతం రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడగా వెళ్తున్నారంటూ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి రుసరుసలాడారు. ఈ వివాదం అధిష్టానానికి వెళ్లడంతో దిగ్విజయ్ సింగ్ ను పంపించారు. అయన ఇక్కడి వివరాలు తెలుసుకొని నివేదిక అందించారు. అయితే రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, రేవంత్ రెడ్డిలు కలిసి పార్టీకి నష్టాన్ని తెస్తున్నారని సీనియర్లు ఫిర్యాదు చేశారు.
అయితే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జిని మార్చేశారు. ఠాగూర్ స్థానంలో మాణిక్ రావు థాక్రేను రంగంలోకి దించారు. ఆయన బాధ్యతలు తీసుకున్న వెంటనే సమావేశానికిరావాలని నాయకులందరికీ పంపించారు. కానీ ఇప్పడు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాలేదు. అయితే తాజాగ మరోసారి ఆయనను ఆహ్వానించడంతో వెంటనే గాంధీ భవన్ మెట్లేక్కారు. భవిష్యత్ లో గాంధీ భవన్ మెట్లేక్కేదిలేదని శపథం చేసిన వెంకటరెడ్డి అనూహ్యంగా శుక్రవారం శపథాన్ని పక్కనబెట్టారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డిల మధ్య ఇంతకాలం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయి ఉండేది. కానీ గాంధీభవన్లో వీరిద్దరు కలిసి ముచ్చటిస్తున్న ఫొటోలు బయటికి వచ్చాయి. వెంటనే అవి వైరల్ గా మారింది. దీంతో కాంగ్రెస్ లో ఒక అసంతృప్తి సద్దుమణిగిందని పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.