ఇలాంటి మాట అంటే అగ్రహం చెందేవారెందరో. మూకుమ్మడి మ్యాచ్ పిక్సింగ్ లాంటి మాటలెలా అంటారంటూ అరిచేసే వాళ్లెందరో? కానీ.. విషయంలోకి వెళితే.. ఇందులో నిజం లేదనిపించక మానదు. బుధవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరి.. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వివిధ పార్టీలు అడిగే సభ్యులు అడిగే ప్రశ్నల్ని లాటరీ వేసి తీశా రట.
ఆశ్చర్యకరంగా ఈ ప్రశ్నలు సంధించిన వాటిలో ఒక్కటంటే.. ఒక్కటి కూడా ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించిన ప్రశ్న లేదంట. దీనికిపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒక్క ఓటుకు నోటుకు సంబంధించిన వ్యవహారమే కాదు.. ఫోన్ ట్యాపింగ్ అంశంపై కూడా ప్రశ్నలు అడిగింది లేదంట.
అధికార టీఆర్ ఎస్.. విపక్ష టీటీడీపీ నేతలు ప్రశ్నలు వేయలేదంటే అర్థం చేసుకోవచ్చు. కానీ.. కాంగ్రెస్.. వామపక్షాలు.. బీజేపీ.. మజ్లిస్ పార్టీలేవీ కూడా ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించిన ప్రశ్నలు వేయకపోవటం కాస్తంత చిత్రమైన యవ్వారమే. వివిధ పార్టీలకు చెందిన సభ్యులు మొత్తం 150 ప్రశ్నలు సంధించాలని డిసైడ్ అయ్యారంట.
వీటిల్లో ఒక్క ప్రశ్న కూడా ఓటుకు నోటుకు సంబంధించింది లేకపోవటం చూస్తే.. షాక్ తినాల్సిందే. వివాదాస్పద అంశాలు తెరపైకి తీసుకురాకూడదని భావించారో లేక.. ఈ వ్యవహారాలన్నీ కోర్టులలో ఉన్న నేపథ్యంలో వాటి గురించి ప్రశ్నలు సంధించటం అనవసరం అనుకున్నారేమో కానీ.. ఒక్క ప్రశ్న కూడా లేదు.
ఇదిలా ఉంటే.. అసెంబ్లీలో ఉన్న పార్టీ సభ్యులెవరో ఓటుకు నోటు వ్యవహారం గురించి ప్రశ్న వేయలేదన్న మాటకు మాజీ మంత్రి డీకే అరుణ స్పందిస్తూ.. ఔను కదూ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాదు.. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఓటుకు నోటు కేసు గురించి ప్రశ్న వేయలేదు కదూ.. మర్చిపోయి ఉంటారంటూ డీకే అరుణమ్మ మాట విన్న వారంతా అవాక్కు అయ్యే పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాల్నే కాదు.. రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ఓటుకు నోటు గురించిన ప్రశ్నలు రాజకీయ పార్టీ నేతలు ఎందుకు మర్చిపోయారంటారు..?