ఆ ఇడియెట్ ను పక్కనపెట్టుకోవద్దు జగన్ గారు.. ఆర్జీవీ ఫైర్

Update: 2022-01-11 03:28 GMT
ఏపీలో సినిమా టికెట్ల వివాదం మరింత రాజుకుంది. నిన్న రాంగోపాల్ వర్మ స్వయంగా ఏపీకి వెళ్లి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినానిని కలిసి వచ్చారు. సమస్యలు వివరించాడు. పరిష్కారం కోసం కృషి చేశాడు. తాజాగా ఏపీ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక సినీ హీరోలు, సినీ ప్రముఖులపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఘాటుగా స్పందించారు. ‘ప్రసన్నకుమార్ రెడ్డి టాలీవుడ్ పై చేసిన కామెంట్స్ విన్న తర్వాత ఆర్జీవీ రెచ్చిపోయారు. ‘వైఎస్ జగన్ గారు.. మీ మీద గౌరవం ఉంది. వీడిలాంటి వాడిని.. ప్రసన్నకుమార్ రెడ్డి పక్కనపెట్టుకుంటే మీ ప్రతిష్టను మంటగలుపుతున్నారు. మీ అభిమానిగా నేను మీకు సలహా ఇస్తున్నాను. ఇలాంటి ఇడియెట్స్ ను ప్రోత్సహించకండి’ అంటూ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ ఎమ్మెల్యేను ఇడియట్ అని ఎందుకు అన్నానో రాంగోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చాడు. అసలు సినిమా పరిశ్రమ గురించి అస్సలు తెలియని వ్యక్తి ఆయన అని వర్మ అన్నారు. సినీ ఇండస్ట్రీలో ఎవరు ఏం చేస్తారు? నిర్మాతలు, హీరోలు, దర్శకులు, డిస్ట్రిబ్యూటర్లు అంతా వేర్వేరు. సినిమా రిలీజ్ విషయం అసలు హీరోలు, దర్శకులకు తెలియదని వర్మ అన్నారు.

ఎవరైతే బ్లాక్ లో టికెట్స్ అమ్ముతున్నారో తెలియకుండా సినిమా వాళ్లను మూకుమ్మడిగా చుట్టేసి మాట్లాడే వాడిని మూర్ఖుడు అంటాం.. అలాంటి వాడి గురించి నేను మాట్లాడడం శుద్ధ దండగ అని ప్రసన్నకుమార్ రెడ్డిపై వర్మ నిప్పులు చెరిగారు.

ఏపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న పేర్నినానికి అమితమైన గౌరవం ఇస్తానని.. ఎందుకంటే చాలా హుందాగా మాట్లాడుతారని వర్మ చెప్పుకొచ్చారు. నేను అదే విధంగా మాట్లాడుతానన్నారు. నా ముందు ఉన్న వ్యక్తిని బట్టి గౌరవం ఇస్తానన్నారు.  ప్రసన్నకుమార్ రెడ్డి లాంటి వాడికి గౌరవం ఇవ్వడం నాకు సరిపడదు అని వర్మ అన్నారు. ఏపీ మంత్రి పేర్ని నానితో సానుకూలమైన చర్చ జరిగిందని.. సినీ పరిశ్రమ గురించి కొన్ని విషయాలు వారికి చెప్పానని అన్నారు. వారు ఆలోచించుకొని ఓ నిర్ణయానికి వస్తానని భావిస్తున్నట్టు వర్మ తెలిపారు.

-సినిమా వాళ్లు బలిసేలా చేశావ్ చంద్రబాబు.. వైసీపీ ఎమ్మెల్యే ఫైర్

అంతకుముందు నిన్న టాలీవుడ్ ను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సినీ పెద్దలపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమారెడ్డి దారుణంగా మాట్లాడారు. ‘సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నట్టు’ ఆయన అన్నట్టు పలు మీడియాల్లో ప్రసారం అవుతోంది.అసలు సినిమా వాళ్లకు ఏపీ గుర్తుందా? అని వైసీపీ ఎమ్మెల్యే ప్రశ్నించారు.

సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తే సామాన్యులు కూడా పెద్ద సినిమాలు చూస్తారని వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ఘాటు కామెంట్స్ చేశారు. వైసీపీ ప్రభుత్వం నిర్ణయంలో తప్పేంటని సమర్థించుకున్నారు.సినిమా వాళ్ల పొట్టలు కొడుతున్నాడు జగన్ మోహన్ రెడ్డి అంటున్నారని.. ఎక్కడ కొడుతున్నామని నల్లపురెడ్డి ప్రశ్నించారు. సినిమా టికెట్ రేట్లు తగ్గించాం.. అది పేదవాళ్లకు ముఖ్యమా కాదా? ఈరోజు ఉన్న హీరోలంతా కోట్లు సంపాదించుకుంటున్నారు.. వారికేమీ.? బ్రహ్మాండంగా విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు.

అదే ఒక పేదవాడు సినిమా చూద్దామని పోతే రూ.100, 500, 1500 అంటూ బ్లాక్ లో అమ్ముతున్నారు. పెద్ద పెద్ద సినిమాలకు ఇది న్యాయమంటారా? ఉమ్మడి రాష్ట్రంలో దీన్ని ఎవరైనా పట్టించుకున్నారా? ఆంధ్ర రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పేసి సినీ నిర్మాతలు, దర్శకులు, హీరోలు అనుకుంటున్నారా? ఎంతసేపు హైదరాబాద్ లో కూర్చొని తెలంగాణలో మూవీస్ చేసుకొని అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారే తప్పితే ఇక్కడొక ఆంధ్రప్రదేశ్ ఉందని మీకు గుర్తుందా? అని నల్లపురెడ్డి ప్రశ్నించారు.

సినిమా టికెట్లు తగ్గించాం.. పేదలు సినిమా చూడాలంటే బ్లాక్ లో 1500 అమ్ముతారు.? అదెందుకు అడగడు చంద్రబాబు నాయుడు? నువ్వు 9 ఏళ్లు సీఎంగా చేశావ్.. పేదల కోసం సినిమా టికెట్లు తగ్గించిన సందర్భం ఉందా? వాళ్లకు సపోర్టు చేశావ్.. వాళ్లు బలిసే విధంగా చేశావ్.? ఈరోజు మేం పేదల పక్షాన నిలబడి సినిమా టికెట్ల తగ్గిస్తే నువ్వు మాట్లాడుతావా? చంద్రబాబు అని నిలదీశారు.సినిమా ఇండస్ట్రీ అంతా నీకు సంబంధించిన వాళ్లు.. నీ కమ్యూనిటికి చెందిన వాల్లు ఉన్నారు కాబట్టి వాళ్లకు నువ్వు సపోర్టు చేసి వాళ్లను బలపరుస్తున్నావని నల్లపురెడ్డి కామెంట్ చేశారు.
Tags:    

Similar News