కోవిడ్ టీకా విషయంలో ధనిక దేశాలు ఏమి చేస్తున్నాయో తెలుసా ?

Update: 2020-12-10 14:30 GMT
మనుషుల్లో స్వార్ధం పెరిగిపోతోందనే విషయం ఇప్పటికే చాలా సందర్భాల్లో నిరూపణైంది. తాజాగా ప్రపంచంమొత్తాన్ని వణికించేస్తున్న కరోనా మహమ్మారి బాగా ఉధృతంగా ఉన్న కాలంలో మానవత్వాన్ని చాటుకునేందుకు చాలా ఉదాహరణలే కనిపించాయి. అలాగే మానవత్వం మృగ్యమైపోయిందనేందుకు కూడా చాలా ఉదాహరణలే వెలుగుచూశాయి. అయితే తాజాగా కరోనా టీకా తయారవుతోందన్న విషయం మానవాళిని ఒకవైపు హ్యాపీగా ఫీలయ్యేట్లు చేస్తోంది. ఇదే సమయంలో స్వార్ధం కూడా బయటపడుతోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే కరోనా వైరస్ యాంటీ టీకా తయారీ ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా ? వేసుకుందామా ? అని జనాలంతా ఎదురు చూస్తున్నారు. అయితే టీకా తయారై మార్కెట్లోకి వచ్చినా జనాలందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు దాదాపు లేదనే సత్యం బయటపడింది. ప్రపంచ జనాభాలోని ప్రతి పదిమందిలో తొమ్మిది మంది టీకా వేయించుకోవటానికి కనీసం మరో ఏడాది వరకు వెయిట్ చేయాల్సిందే అన్న విషయం తాజాగా బయటపడింది.

ప్రపంచ జనాభాకు కోవిడ్ 19 వ్యాక్సిన్ అంటే విషయంలో ‘పీపుల్స్ వ్యాక్సిన్ కూటమి’ అనే సంస్ధ ఒకటి సర్వే చేసిందట. ఈ సర్వే ప్రకారం ఫైజర్, ఆస్ట్రాజెనికా కంపెనీలు తయరు చేస్తున్న టీకాను ముందుగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందించాలనే అనుకున్నాయట. కానీ ఆచరణలో అది సాధ్యమయ్యేట్లు లేదని తేలిందట. ఎందుకంటే పెద్ద దేశాలుగా ప్రచారంలో ఉన్నవి తమ అవసరాలకు మించి ఐదురెట్లు ఎక్కువగా టీకాను కొనుక్కునేందుకు ఇప్పటికే ఆర్డర్లిచ్చాయట. అంటే బాగా అభివృద్ధి చెందిన దేశాల్లోని 14 శాతం జనాభా దగ్గరే 53 శాతం వ్యాక్సిన్ నిల్వలుంటాయని ఓ అంచనా.

బ్రిటన్లో ఇప్పటికి వ్యాక్సిన్ ఇవ్వటం మొదలైన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ మొత్తం జనాభాతో పోల్చుకుంటే వచ్చిన ఆర్డర్లు, అమ్ముడుపోయిన టీకాలు కొన్ని రెట్లు ఎక్కువగా ఉన్నాయట. అలాగే కెనాడా కూడా తమ జనాభా మొత్తానికి అవసరమైన వ్యాక్సిన్ కన్నా ఐదురెట్లు ఎక్కువగా ఆర్డర్ చేసిందట. జరుగుతున్నది చూస్తుంటే ముందు జాగ్రత్తో లేకపోతే ప్రాణభయం వల్లే ధనిక దేశాలు తమకు అవసరమైన వ్యాక్సిన్ కన్నా కొన్నిరెట్లు ఎక్కువగా కొనుగోలు చేయటానికి రెడీ అయిపోయాయంటే ఇక మిగిలిన దేశాల్లోని జనాభా పరిస్ధితేమిటి ?
Tags:    

Similar News