ఆ ఎయిర్ లైన్స్ ఎక్కొద్ద‌న్న బాలీవుడ్ న‌టుడు

Update: 2018-08-11 05:15 GMT
ఒళ్లంతా కండ‌కావ‌రం అన్న మాట‌కు నిలువెత్తు రూపంగా బ్రిటిష్ ఎయిర్ వేస్ పై ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుంటారు. అదే పనిగా ఆ ఎయిర్ లైన్స్ సిబ్బంది వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు త‌ర‌చూ విమ‌ర్శ‌ల‌కు గురవుతుంటారు. అయిన‌ప్ప‌టికీ త‌న తీరును మార్చుకోని ఎయిర్ వేస్ పై  తాజాగా చోటు చేసుకున్న ఒక వివాదం ఇప్పుడు భార‌తీయుల్ని మండిపోయేలా చేస్తోంది.

ఇదిలా ఉంటే ఈ ఎయిర్ వేస్ మీద బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు రిషి క‌పూర్ తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. విమానంలో పిల్లాడు ఏడుస్తున్నాడ‌ని బ్రిటిష్ ఎయిర్ వేస్ సిబ్బంది బ‌ల‌వంతంగా విమానాన్ని దించ‌టంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండ‌గా.. బ్రిటిష్ ఎయిర్ వేస్ తీరుపై ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు  రిషిక‌పూర్  త‌న ఆగ్ర‌హాన్ని ట్వీట్ రూపంలో వెల్ల‌డించారు.

జాతి వివ‌క్ష‌తో బ్రిటిష్ ఎయిర్ వేస్ వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న రిషి.. ఇక నువ్వు విమానాలు న‌డుపుకోవ‌టం ఆపేయాల‌న్నారు. మేం మీ సిబ్బంది చేత బ‌య‌ట‌కు గెంటించుకోలేమ‌న్న ఆయ‌న‌.. బెర్లిన్ కు చెందిన ఒక భార‌తీయ కుటుంబాన్ని గెంటేయ‌టం క‌లిచివేసింద‌న్నారు.

ఈ సంద‌ర్భంగా త‌న‌కు ఎదురైన అనుభ‌వాన్ని ప్ర‌స్తావించారు. కొన్ని నెల‌ల క్రితం ఫ‌స్ట్ క్లాస్ ప్ర‌యాణికుడు అయిన త‌న‌తో క్యాబిన్ సిబ్బంది అమ‌ర్యాద‌క‌రంగా ప్ర‌వ‌ర్తించార‌న్నారు. అప్ప‌టి ఉంచి బ్రిటిష్ ఎయిర్ వేస్ కు చెందిన ఫ్లైట్ల‌లో ప్ర‌యాణించ‌టంతో మానేసిన‌ట్లుగా చెప్పారు. జెట్ ఎయిర్ వేస్ లేదంటే ఎమిరేట్స్ కు చెందిన విమానాల్లో ప్ర‌యాణించాల‌ని.. వారైతే మ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తిస్తార‌ని రిషి పేర్కొన్నారు. బ్రిటిష్ ఎయిర్ వేస్ బ‌లుపు వ్య‌వ‌హారంపై ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. బాలీవుడ్ ప్ర‌ముఖుడి ట్వీట్ ఇప్పుడు వైర‌ల్ గా మారింది.
Tags:    

Similar News