యాష్ ...పేరుకి కన్నడ సినిమా ఇండస్ట్రీ స్టార్ హీరో అయినా కూడా, కేవలం ఒకే ఒక్క సినిమాతో ఇండియా వైడ్ గా పాపులర్ అయ్యాడు. అప్పటి వరకు కన్నడలో మాత్రమే ఆయన స్టార్ హీరో కానీ, అయన నటించిన కెజియఫ్ సినిమా తర్వాత కన్నడ తో పాటుగా తెలుగు - హిందీలో కూడా యాష్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అలాంటి స్టార్ హీరోను చంపడానికి కర్ణాటక లో కుట్ర జరిగింది.
యశ్..హత్యకు ప్లాన్ చేసిన వారిలో స్లమ్ భరత్ ప్రధాన నిందితుడు. 2019 మార్చి 7న.. స్లమ్ భరత్ అతని అనుచరులు యశ్ హత్యకు కుట్ర పన్నారు. అయితే వారి ప్లాన్ ను ముందుగానే పసిగట్టిన పోలీసులు, వారి ప్లాన్ ను చెడగొట్టి వారందరిని అరెస్ట్ చేశారు. ఆ తరువాత బెయిల్ పై విడుదల అయ్యాడు. అప్పట్లో ఈ కేసు సంచలనం రేపింది.
ఇంతటి నేరచరిత్ర కలిగిన స్లమ్ భరత్ ను తాజాగా కర్ణాటక పోలీసులు మట్టుపెట్టారు. చాలా నేరారోపణలతో పరారీలో ఉన్న స్లమ్ భరత్‌ను రెండ్రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు అరెస్ట్ చేసారు.. ఆ తర్వాత బెంగళూరుకు తీసుకొచ్చారు. పోలీసులు చెబుతున్న కథనం ప్రకారం చూస్తుంటే క్రైమ్ సీన్‌లో రీ కన్సట్రక్షన్ చేస్తున్న సమయంలో పోలీసులపై దాడికి ప్రయత్నించాడు.
దీనితో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో భరత్ పొత్తి కడుపులోకి, కాలులోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. తీవ్రంగా గాయపడిన అతడిని సప్తగిరి ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి విక్టోరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే స్లమ్ భరత్ మృతి చెందాడని పోలీసులు తెలిపారు.ఈ తెల్లవారుజామున హీసరఘట్టలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. మొత్తంగా స్లమ్ భరత్ ఒక కరుడుగట్టిన క్రిమినల్ అని , అతని పై హత్య, హత్యాయత్నం సహా 50కిపైగా క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు చెప్పారు.