కాలం మారింది. గతంలో మాదిరి అబ్బాయి అమ్మాయిని ప్రేమించి పెళ్లాడే రోజులు పోయాయి. అమ్మాయి అమ్మాయిని.. అబ్బాయిని అబ్బాయిని ప్రేమించటమే కాదు.. ఇరువురు కలిసి జీవించాలనే వరకు విషయాలు వెళ్లిపోయాయి. సృష్టి ధర్మానికి విరుద్దంగా వ్యవహరిస్తున్నారంటూ సంప్రదాయవాదులు తిట్టి పోస్తున్నా.. తమకేం ఫర్లేదన్నట్లుగా వ్యవహరించే వారు ఎక్కువైపోయారు.
వీరి డిమాండ్లకు సానుకూలంగా స్పందించిన కొన్ని దేశాలు తమ దేశాల్లో ఇలాంటి పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పించాయి. మరికొన్ని దేశాల్లో మాత్రం ఇప్పటికి ఇలాంటి పెళ్లిళ్ల మీద నిషేధం విధించటమే కాదు.. ఇదో పెద్ద తప్పు అన్నట్లు చూస్తున్నాయి. ఆ కోవలోకే వస్తుంది రష్యా.
ఈ దేశంలో స్వలింగ సంపర్కం అన్నది నేరంగా 1993లో నిర్ణయించటమే కాదు.. అలాంటి పదమన్నది ఎక్కడా వినిపించకూడదని.. ఆ పదాన్ని వాడకూడదంటూ బ్యాన్ చేశారు 2013లో. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పేరున్న క్రీడాకారిణి.. తానో స్వలింగ సంపర్కురాలినని.. తన భాగస్వామి ఫలానా అని ప్రకటించటానికి మించిన షాకింగ్ అంశం ఇంకేం ఉంటుంది? ఇప్పుడు అలాంటి పనినే చేశారు రష్యా టెన్నిస్ స్టార్.. ప్రపంచ 12వ నెంబరు క్రీడాకారిణిని అయిన డారియా కసత్కినా.
‘‘అవును.. నేనో లెస్బియన్. నా క్యూటీ పై నటాలియా జుబైకో’’ అన్న అర్థం వచ్చేలా ఆమె ఫోటోను షేర్ చేసింది. ఆమె తెగువకు.. ధైర్యానికి అందరూ షాక్ తింటున్నారు. అనంతరం ఒక యూ ట్యూబ్ ఛానల్ లో మాట్లాడిన ఆమె.. స్వలింగ సంపర్కంపై బ్యాన్ విధించటాన్ని ఆమె తప్పు పట్టారు. రష్యాలో ఇంతకంటే ముఖ్యమైన అంశాలెన్నో బ్యాన్ చేయాల్సినవి ఉన్నాయని.. వాటి మీద ప్రభుత్వం ఫోకస్ చేయాలన్న రీతిలో ఆమె వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ చెప్పినట్లు తమ పార్టనరక్ తో గదిలోనే జీవించి.. బయటకు మాట్లాడకపోవటంలో అర్థం లేదన్న ఆమె.. ‘ఏం చెప్పాలి? ఏం చెప్పకూడదన్నది వ్యక్తుల ఇష్టం. అది వారికి సంబంధించిన విషయం’ అని స్పష్టం చేశారు. ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. గత వారం రష్యన్ ఫుట్ బాల్ క్రీడాకారిణి నడ్య కరపోవా కూడా స్వలింగ సంపర్కం మీద ఓపెన్ గా మాట్లాడి సంచలనంగా మారారు.
ఇదే విషయాన్ని నటాలియా ప్రస్తావిస్తూ.. ఇదే అంశంపై కరపోవా మాట్లాడినందుకు తాను హ్యాపీగా ఉన్నానని.. అయితే ఈ విషయం మీద చాలామంది మాట్లాడాలన్నారు. అమ్మాయిలు దీని మీద తమ గళాన్ని వినిపించాలని.. యువత మద్దతు ఉండాలని వ్యాఖ్యానించారు. మరి.. దీనిపై రష్యన్ ప్రభుత్వం ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.