చెప్పుతో కొట్టుకొని ఓట్లు అడిగిన నాయ‌కుడు

Update: 2017-01-31 07:12 GMT
సాధార‌ణంగా ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకొనేందుకు అభ్యర్థులు వివిధ రకాల వాగ్ధానాలు ఇస్తుంటారు. కానీ ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ లో మాత్రం ఓ ఎమ్మెల్యే అభ్యర్థి త‌న ప్రచారంలో ఓటర్లను క్షమాపణలు కోరుతూ తనని తాను షూతో కొట్టుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ లోని బులందర్‌ షహర్‌ లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. కాగా, ఈ ఘటనపై ఆ పార్టీ స్పందించకపోవడం గమనార్హం.

యూపీలో అధికార సమాజ్‌ వాదీ పార్టీకి చెందిన షుజాత్ ఆలమ్ వృత్తి రీత్యా లాయర్. అంతకుముందు రెండు సార్లు జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి బీఎస్‌ పీ అభ్యర్థి హజీఅలీంపై పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ప్రసంగ సమయంలో ‘తెలీక ఏమైన తప్పులు చేసి ఉంటే మన్నించండి’ అంటూ షూతో కొట్టుకుంటూ ఓట్లు అభ్య‌ర్థించారు. కాగా ఇటీవ‌లే యూపీలో ఓ ఎమ్మెల్యే అభ్య‌ర్థి స్వ‌తంత్రుడిగా బ‌రిలో దిగుతూ తాను ప్ర‌జ‌ల‌ను మోసం చేసేందుకే రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్లు చెప్పిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. తాను మోసం చేయ‌డం ద్వారా డ‌బ్బులు సంపాదించుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించిన వీడియో క‌ల‌క‌లం రేకెత్తించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News