సత్య నాదెళ్ల.. ప్రపంచంలో అతిపెద్ద టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కు సీఈవో.. పైగా మన తెలుగువాడే.. ప్రపంచాన్ని ఏలుతున్న సంస్థకు నాయకుడిగా ఉన్న సత్య తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్ సహా టెక్ కంపెనీలన్నీ ఉద్యోగులతో వర్క్ ఫ్రం హోంతో పనులు కొనసాగించడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని సత్యనాదెళ్ల ఆందోళన వ్యక్తం చేశారు.
ట్విట్టర్ వంటి కొన్ని టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను భవిష్యత్ లో ఇంటి నుండి ఎప్పటికీ పనిచేయించడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. వర్చువల్ వీడియో కాల్స్ తో మాట్లాడుతూ ఇలాంటి రిమోట్ పనిని శాశ్వతంగా చేయడం వల్ల.. వ్యక్తిగతంగా మీటింగ్ లకు ఉద్యోగులు హాజరు కావడం లేదు. ఇలాంటి పరిణామాలు సామాజిక పరస్పర చర్య లేక మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం ఉద్యోగులపై చూపుతాయని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా హెచ్చరించారు.
తాజాగా ఓ దిగ్గజ మీడియాతో మాట్లాడిన సత్య నాదెళ్ల ‘వర్క్ ఫ్రం హోం’పై సంచలన వ్యాఖ్యలు చేశారు. "వర్క్ ఫ్రం హోంతో ఇంట్లోనే నాలుగు గదుల మధ్య పనులు చేస్తే మానసిక ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఆ కనెక్టివిటీ మరియు కమ్యూనిటీ బిల్డింగ్ ఎలా ఉంటుంది? ఈ దశలో మనం నిర్మించిన కొన్ని సామాజిక మూలధనాన్ని మనం కాల్చేస్తున్నాము.. మనమందరం రిమోట్ గా పనిచేస్తున్నాం. దీనివల్ల మెంటల్ గా మనుషులు దెబ్బతింటారు " అని నాదెళ్ల హాట్ కామెంట్స్ చేశారు.
ఈ మహమ్మారి వ్యాప్తి ముగిసిన తర్వాత కూడా ఇంటి నుండి 'ఎప్పటికీ' పనిచేయడానికి ట్విట్టర్ తన సిబ్బందికి ఆప్షన్ ఇవ్వడం విపరిణామాలకు దారితీస్తుందని సత్యనాదెళ్ల హెచ్చరించారు. ఫేస్బుక్, ఆల్ఫాబెట్ (గూగుల్) మరియు ఇతరులు తమ ఉద్యోగులను ఇంటి నుండి సంవత్సరం చివరి వరకు పని చేయమని కోరిన తరువాత ట్విట్టర్ ఇలా తన ఉద్యోగులకు ఆప్షన్ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్ మాత్రం వర్క్ ఫ్రం హోం విధానాన్ని మాత్రం అక్టోబర్ వరకు పొడిగించింది. ఎక్కువగా పొడిగించడానికి ఇష్టపడలేదు.
ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ స్టాక్ ధర ఈ సంవత్సరం 14 శాతం పెరిగింది. కంపెనీకి దాదాపు 140 బిలియన్ డాలర్ల నగదు ఉంది. మైక్రోసాఫ్ట్ తన ఇటీవలి త్రైమాసికంలో 10 బిలియన్ డాలర్లను షేర్ బైబ్యాక్ .. డివిడెండ్ల కోసం ఖర్చు చేసింది, ఇది అంతకుముందు సంవత్సరం కంటే 30 శాతానికి పైగా పెరిగింది.
మైక్రోసాఫ్ట్ కూడా చిన్న వ్యాపారాలు.. నగదు లభ్యత సహాయం అవసరమైన ఇతర సంస్థలకు క్రెడిట్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నామని సత్యనాదెళ్ల తెలిపారు. ఈ సంక్షోభం మధ్య భారతీయ చిన్న మరియు మధ్యతరహా వ్యాపారాలను కొనసాగించడానికి.. తిరిగి ప్రారంభించడానికి మైక్రోసాఫ్ట్ కంపెనీ కొత్త పరిష్కారాలను ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు.