హైదరాబాద్ కు వచ్చేందుకు సత్య నాదెళ్లకు అంత టైమా?

Update: 2019-09-15 05:28 GMT
విశ్రాంత ఐఏఎస్ అధికారి యుగంధర్ అన్న దాని కంటే.. మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈవోగా సత్యనాదెళ్ల తండ్రిగా ఈ తరానికి పరిచయస్తుడిగా చెప్పాలి. ప్రధాని పీవీ హయాంలోనూ.. చంద్రబాబుతో పాటు పలు ప్రభుత్వాల్లో కీలక పదవుల్లో పని చేసినప్పటికీ.. నిరాడంబరంగా.. వివాదరహితుడిగా పేరున్న ఆయన.. శుక్రవారం మరణించిన వైనం తెలిసిందే.

శుక్రవారం యుగంధర్ కన్నుమూసినా.. ఆయన మరణవార్త మీడియాకు చాలా ఆలస్యంగా అందిందని చెప్పాలి. మీడియాకు.. ప్రచారాలకు దూరంగా ఉండటం.. చాలా తక్కువమందితో మాత్రమే మాట్లాడే ఆయన తీరు కూడా యుగంధర్ మరణవార్త ఆలస్యంగా ప్రపంచానికి తెలిసేలా చేసిందని చెప్పాలి. ప్రస్తుతం ఆయన భౌతికకాయం గచ్చిబౌలిలోని సిటిజన్ ఆసుపత్రిలో భద్రపర్చినట్లుగా తెలుస్తోంది.

అమెరికాలో ఉన్న సత్యనాదెళ్ల.. తన తండ్రి మరణవార్త విన్నంతనే భారత్ కు బయలుదేరినట్లు చెబుతున్నారు. మరి.. ఆయన రావటానికి ఎందుకింత టైం పట్టిందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. సత్యనాదెళ్ల ఏమీ సామాన్యమైన వ్యక్తి కాదు. ప్రపంచాన్ని ప్రభావితం చేసే పది మంది టాప్ సీఈవోల్లో ఒకరుగా చెప్పాలి. అలాంటి ఆయనకు.. అమెరికా నుంచి భారత్ వచ్చేందుకు ప్రత్యేక విమానంలో వచ్చేయొచ్చు.

కానీ.. అలా ఎందుకు జరగలేదన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తన తండ్రి మరణవార్తతో హైదరాబాద్ కు ప్రత్యేక ఫ్లైట్ లో వచ్చేయాలని సత్యా నాదెళ్ల ప్లాన్ చేశారని. .కానీ అది సాధ్యపడలేదని తెలుస్తోంది. ఆయన ప్రత్యేక విమానానికి అనుమతులు రాకపోవటంతో.. ఆయన అందరిలానే సాధారణ ఫ్లైట్ లో వస్తున్నట్లు తెలుస్తోంది. సత్యానాదెళ్ల స్థాయి లాంటి వ్యక్తులకు సైతం అనుమతులు రాకుండా ఉండటమా? అన్న ఆశ్చర్యం పలువురినోట మాట రానివ్వకుండా చేస్తోంది.
Tags:    

Similar News