షిర్డీ సాయిబాబాను పూజించడంపై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ద్వారకా-శారదా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయన షిర్డీ సాయితో పాటు మహారాష్ట్రలోని శని సింగనాపూర్ ఆలయంలోనికి మహిళల ప్రవేశంపైనా విమర్శలు చేశారు. శని సింగనాపూర్ ఆలయంలోకి మహిళలను అనుమతించడాన్ని ఆయన తప్పు పట్టారు. దీని వల్ల అత్యాచారాలు జరుగుతాయన్నారు. మహిళలు శని సింగనాపూర్ ఆలయం గర్భగుడిలోనికి మహిళల ప్రవేశం వారికి దురదృష్టాన్ని తీసుకువస్తుందని స్వరూపానంద సరస్వతి అన్నారు.
దీంతోపాటు ఎప్పటిలాగానే సాయిబాబాపైనా విమర్శలు చేశారు. మహారాష్ట్రలో సాయిబాబాను పూజించడం వల్లే కరవు వచ్చిందని ఆయన చెప్పారు. ప్రత్యేకించి షిర్డీలో సాయిబాబాకు ఆరాధనలు చేయడం వల్లే కరవు - నీటి కొరత ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. కాగా స్వరూపానంద సరస్వతి గతంలోనూ పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయి. శనిసింగనాపూర్ లో మహిళల ప్రవేశంపై భిన్నవాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపాయి. దాన్ని వ్యతిరేకిస్తే వ్యతిరేకించొచ్చు కానీ, శపించినట్లుగా తీవ్ర వ్యాఖ్యలు చేయడం సరికాదన్న భావన వ్యక్తమవుతోంది.