కరోనా మహమ్మారి దశలవారీగా కోరలు చాస్తోంది. దక్షిణాఫ్రికాలో ఉద్భవించిన ఒమిక్రాన్ వేరియంట్ మనదేశంలో కూడా పంజా విసురుతోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో ఒమిక్రాన్ నిర్ధారణ అవుతోంది. అంతేకాకుండా ఇటీవల వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరిగింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా చురుగ్గా సాగుతోంది. రూరల్, అర్బన్ ఏరియాల్లో సమాంతరంగా టీకా పంపిణీ జరుగుతుంది. కాగా 2022 డిసెంబర్ 31 నాటికి రికార్డు స్థాయిలో మన దేశంలో వ్యాక్సినేషన్ జరిగింది. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటాను ప్రకటించింది.
దేశంలో యమ జోరుగా టీకా పంపిణీ జరుగుతోందని కేంద్రం పేర్కొంది. అంతేకాకుండా ఇప్పటివరకు 145 కోట్ల మందికి టీకా ఇచ్చినట్లు వెల్లడించింది. వ్యాక్సినేషన్ లో మొదటి ప్రాధాన్యం గా భావించి వృద్ధుల్లో టీకా శాతం మెరుగ్గానే ఉంది. 60 ఏళ్లు పైబడిన వారిలో 69 శాతం మందికి రెండు డోసులు పూర్తయినట్లు కేంద్రం తెలిపింది. రెండో ప్రాధాన్యం ఇచ్చిన వారిలో వ్యాక్సినేషన్ యాక్టివ్ గా సాగింది. ఇక 45-59 ఏళ్ల మధ్య గల వారిలో 73 శాతం మందికి పూర్తి వ్యాక్సినేషన్ జరిగినట్లు స్పష్టం చేసింది.
వ్యాక్సినేషన్ ప్రక్రియలో చివరి ప్రాధాన్యంగా యువతను భావించారు. వయోజనులు ఆరోగ్యవంతంగా ఉంటారు కాబట్టి వారికి చివరి దశలో టీకా అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో 18-44 ఏళ్ల మధ్య గల వారిలో టీకా పంపిణీ శాతం తక్కువగా నమోదైంది. అనగా వయోజనుల్లో 55 శాతం మంది మాత్రమే రెండు డోసులు టీకాలను తీసుకున్నారు. అయితే సింగిల్ డోసు తీసుకున్న వారి శాతం మాత్రం మెరుగ్గానే ఉంది.
దేశంలో 90 శాతం మందికి పైగా మొదటి డోసు వ్యాక్సిన్ ను 2021, డిసెంబర్ 31 నాటికి తీసుకున్నట్లు కేంద్ర గణాంకాలు స్పష్టమైంది. దేశవ్యాప్తంగా 64 శాతం మంది రెండు డోసులు టీకాను తీసుకున్నారు. ఇకపోతే వందశాతం రెండు డోసులు వ్యాక్సినేషన్ పూర్తయిన రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ నిలిచింది. కాగా తెలంగాణలో వందశాతం మొదటి డోసు వ్యాక్సినేషన్ పూర్తయింది. టీకా పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. అవి ఫలించి వ్యాక్సినేషన్ రికార్డు సాధించింది.
మరోవైపు దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం వరకు దేశంలో 1458 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఒమిక్రాన్ ఉధృతి అధికంగా ఉంది. పశ్చిమ బంగా, కేరళ, ఢిల్లీ, తమిళనాడులోనూ ఒమిక్రాన్ కేసులు ఎక్కువ సంఖ్యలో నిర్ధారణ అవుతున్నాయి. తెలంగాణలో పదుల సంఖ్యలో కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి.