షాకింగ్... ఆ చిన్నారుల్లో క్యాన్సర్ ఎక్కువ!

Update: 2022-02-16 06:32 GMT
చిన్నారుల్లో క్యాన్సర్ కేసులు భారీగా పెరుగుతున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ రూపొందించిన క్లినికోపాథలాజికల్ ప్రొఫైల్ ఆఫ్ క్యాన్సర్ 2021 అనే నివేదిక తెలిపింది. ఈ కేసుల్లో క్యాన్సర్ బారిన పడుతున్న చిన్నారుల సంఖ్య ఎక్కువుగానే ఉన్నట్లు ఆ నివేదిక  పేర్కొంది. 2012 నుంచి 2019 వరకు నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ కింద దేశంలో ఉన్న సుమారు 96 ఆసుపత్రుల నుంచి సేకరించిన డేటా ప్రకారం... 2019 వరకు మన దేశంలో మొత్తంగా 13,32,207 క్యాన్సర్ కేసులు వెలుగు చూసినట్లు తెలిపింది.

వీటిలో సుమారు 6,10,084 కేసులను విశ్లేషించి వారిలో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నట్లు పేర్కొన్నారు పరిశోధకులు. వారిలో పుట్టిన పిల్లల  నుంచి సుమారు పదేళ్ల పిల్లల వరకు ఉన్నట్లు తెలిపారు. అంతేగాకుండా 14 ఏళ్ల లోపు ఉండేవారు కూడా ఎక్కువగా ఉన్నారని పరిశోధనలో తేలింది.  ఇదిలా ఉంటే దాదాపు 8 శాతం క్యాన్సర్ కేసులు 0 నుంచి 14 ఏళ్ల మధ్య ఉండే వారిలో వచ్చినట్లు పేర్కొన్నారు. గత పదేళ్లుగా క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గినట్లు ఈ నివేదిక వెల్లడించింది.

చాలా మంది పిల్లల్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్‌ లను ఇందులో గుర్తించారు. అత్యంత సాధారణంగా రక్తానికి సంబంధించిన లుకేమియా ఒకటని తెలిపారు. ఇది రక్త క్యాన్సర్ అని పేర్కొన్నారు. ఇది సోకిన చిన్న పిల్లలు చాలా మంది మృత్యువాత పడుతున్నట్లు నివేదిక తెలిపింది. ఈ క్యాన్సర్ మానవుని శరీరంలో ఉండే ఎముకలోని మజ్జలో తొలుత వెలుగు చూస్తుందని పేర్కొన్నారు. ఇది అలా ఇలా కండరాలకు, ఎముకలకు, కిడ్నీలకు వ్యాప్తి చెంది ప్రాణాలను బలి తీసుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.
 
పైనా పేర్కొన్న నివేదిక ప్రకారం.. దేశంలో 0-14 సంవత్సరాల వయసు ఉండే చిన్నారుల్లో ఎక్కువ మందిలో ఈ లుకేమియా క్యాన్సర్ వస్తున్నట్లు చెప్పారు పరిశోధకలు. చిన్న పిల్లల్లో వచ్చే క్యాన్సర్ కేసుల్లో కూడా మగ పిల్లల్లో లింఫోమా క్యాన్సర్ అనేది ఎక్కువ వస్తుందని గుర్తించారు. ఈ లూకేమియా క్యాన్సర్ అనేది చిన్నారుల్లో సుమారు 70 శాతం వరకు వస్తుందని నివేదిక చెబుతోంది. దీనిలో కూడా కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. ముఖ్యంగా కిడ్నీ క్యాన్సర్ నాలుగేళ్ల లోపు ఉండే వారిలో వెలుగు చూస్తోందని పేర్కొంది. చాలా మంది పిల్లల నాడీ వ్యవస్థపై ఈ క్యాన్సర్ ప్రభావం పడుతుందని అన్నారు.
 
క్యాన్సర్ అన్ని వయసుల వారిలో వస్తుంది. అయితే పొగాకు వాడకం వల్ల మగవారిలో 48.7శాతం క్యాన్సర్ కేసులు వస్తున్నాయి. మహిళల్లో 16.5 శాతం కేసులు వస్తున్నాయని నివేదిక చెబుతోంది, కేవలం ఒక్క ఏడాదిలో దేశవ్యాప్తంగా 14 లక్షల క్యాన్సర్ కేసులు వచ్చినట్లు పరిశోధకులు గుర్తించారు.
 
పిల్లల్లో క్యాన్సర్ ఎలా వస్తుందనే దానిపై పూర్తిస్థాయిలో వివరాలు లేవు. కానీ లక్షణాలను బట్టి తెలుసుకుని చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి తోడు లక్షణాలు లేకుండా కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని గుర్తించాలి అంటే పరీక్షలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీనికి ఆధునిక పద్ధతిలో చికిత్స విధానాలు కూడా అందుబాటులోకి వచ్చాయని వివరించారు. కీమోథెరపీ మొదలు ఎన్నో మందులు కూడా అందుబాటులోకి వచ్చాయి.
Tags:    

Similar News