ముంబై నగరంలోని లోయర్ పరేల్ లో ఉన్న కమలా మిల్స్ కాంపౌండ్‌లో గురువారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగి 14 మంది సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. అయితే భారత ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో దుర్ఘటనలన్నీ 29వ తేదీనే జరుగుతున్నాయని అంటున్నారు. వరుసగా కొన్ని నెలలపాటు ఇలాంటి ఘటనలే జరిగిన నేపథ్యంలో ఈ అంచనాలు వేస్తున్నారు. ఆగస్టు 29న వచ్చిన భారీ వర్షాలతో ముంబై నగరంలో జన జీవనం అస్తవ్యస్తమైంది. వరదల వల్ల ముంబై - పరిసర ప్రాంతాల్లో పది మంది మృత్యువాత పడ్డారు. సరిగ్గా నెల రోజులకు సెప్టెంబర్ 29న ఎల్ఫిన్ స్టన్ రైలు వంతెనపై జరిగిన తొక్కిసలాటలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మళ్లీ కమలా మిల్స్ కాంపౌండ్ లోని పబ్ లో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది మహిళలతోపాటు 14 మంది మరణించగా, 21 మంది గాయపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో...29వ తేదీ వుంబైకి అచ్చిరావడం లేదంటున్నారు.
కాగా, అగ్ని ప్రమాదం జరిగనప్పుడు అక్కడ ఉండి జస్ట్ మిస్ లో చావును తప్పించుకొని బయటపడ్డ సిద్ధార్థ్ ష్రోఫ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ చేదు ఘటనను మీడియాతో పంచుకున్నాడు. "అప్పుడు సమయం రాత్రి 12.30 కావస్తోంది. అప్పుడే ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. మేము 1 ఎబోవ్ రెస్టారెంట్ లో ఉన్నాం. రెస్టారెంట్ కు మంటలు అంటుకునే సమయానికి అక్కడ దాదాపు 150 మంది దాకా ఉన్నారు. ఒక్కసారిగా మా చుట్టూ మంటలు వ్యాపించడంతో ఏం చేయాలో తెలియక వెంటనే ఎగ్జిట్ గేట్ వైపుకు పరిగెత్తాం`` అని ఆ సమయంలోని బీతావహ అంశాలను వివరించారు.
`ప్రాణాలు కాపాడుకునేందుకు మేం పరుగెత్తిన ఆ గేట్ చాలా ఇరుకుగా ఉంది. అంత మంది వెళ్లడానికి అనువుగా అది లేదు. దీంతో మంటల నుంచి తప్పించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. అయినప్పటికీ.. ఆ గేట్ గుండా కొంతమంది బయటికి పరిగెత్తారు. అప్పటికే నాకు కూడా మంటలు అంటుకున్నాయి. అయినా బయటికి పరిగెత్తి కుప్పకూలిపోయాను. ఇంతలో నన్ను ఎవరో ఆసుపత్రిలో చేర్చారు. నా శరీరం 20 శాతం కాలిపోయింది.." అంటూ తన చేదు అనుభవాలను సిద్ధార్థ్ మీడియాతో పంచుకున్నాడు.