సీఎం ముందే సిక్సర్ కొట్టిన సిద్దూ

Update: 2021-07-24 00:30 GMT
పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఎంత వ్యతిరేకించినా కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించి మెప్పించి పంజాబ్ కాంగ్రెస్ పగ్గాలు అందుకున్నాడు ప్రముఖ క్రికెటర్, నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ.  శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. చండీగఢ్ లోని ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

ఇక సిద్దూను ఎంతగా వ్యతిరేకించినా కాంగ్రెస్ అధిష్టానం నియమించడంతో మనసు చంపుకొని సీఎం అమరీందర్ సింగ్ సహా పార్టీ ప్రముఖులంతా ఈ కార్యక్రమానికి హాజరై అభినందించడం విశేషం.

టీమిండియా మాజీ క్రికెటర్ అయిన సిద్దూకు సిక్సర్ల సిద్దూ అని పేరుంది. ఆయన ఆటగాడిగా అత్యధిక సిక్సులు కొట్టాడు. తాజాగా పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అయిన తర్వాత కూడా సిక్స్ కొడుతున్నట్లుగా సిద్దూ పంజాబ్ సీఎం ముందే ఓ షాట్ ఆడడం సంచలనమైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా తన పేరును పిలవగానే సిద్దూ నిజంగానే బ్యాటింగ్ చేయడానికి వెళుతున్నట్టుగా వామప్ చేస్తూ కుర్చీలో నుంచి లేచి ఓ సిక్సర్ ఆడుతున్నట్లుగా చేతులు ఊపాడు. అమరేందర్ సింగ్ అప్పుడు పక్కనే కూర్చున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా తెగ చక్కర్లు కొడుతోంది.

కాగా సిద్దూ పీసీసీ పగ్గాలు చేపట్టడంతో పంజాబ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ లో తలెత్తిన సంక్షోభం ఎట్టకేలకు ముగిసిందనిపిస్తోంది. రాష్ట్ర సీఎంగా అమరీందర్ సింగ్ కొనసాగుతారని.. ప్రముఖ క్రికెటర్, రాజకీయ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూను రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గా నియమించేలా కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరినీ రాజీ చేసినట్టైంది. దీంతో పంజాబ్ కాంగ్రెస్ లో అసమ్మతి జ్వాల చల్లారినట్టే కనిపిస్తోంది.

అమరీందర్ కు సీఎం పోస్టు.. సిద్దూకు పీసీసీ చీఫ్ పోస్టు తీసుకోవడానికి ఇద్దరూ అంగీకరించారు.. సిద్దూకు ఒక పదవిని ఇస్తారని కొన్నాళ్లుగా ఊహాగానాలు సాగుతున్న విషయం తెలిసిందే. ఇక వీరితోపాటు హిందూ, దళిత వర్గాల నుంచి ఇద్దరు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా ఉంటారని సమాచారం. దీంతో ఇద్దరి మధ్య ఏర్పడిన వివాదం ముగిసినట్టేనని పంజాబ్ కాంగ్రెస్ ఇన్ చార్జి హరీష్ రావత్ తెలిపారు.

కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి సీఎం అమరీందర్ సింగ్ కట్టుబడి ఉంటారని చెబుతున్నారు. త్వరలోనే జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అమరీందర్, సిద్దూ ఇద్దరూ కలిసి పనిచేస్తారని అంటున్నారు.
Tags:    

Similar News