తల్లికి అంత్యక్రియలు చేసి 5 మంది తనయులు మృతి .. అసలు కారణం ఇదే !

Update: 2020-07-21 17:31 GMT
కరోనా మహమ్మారి ... దేశంలో రోజురోజుకి మరింతగా విజృంభిస్తూ అందరిని భయాందోళనకు గురిచేస్తుంది. దేశంలో ఇప్పటికే నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య 12 లక్షలకి చేరువలో ఉంది. అలాగే మరణాల సంఖ్య 6 లక్షలు దాటింది. అలాగే ప్రతి రోజు కరోనా కారణంగా వందలమంది మృత్యు ఒడికి చేరుతున్నారు. సామాన్యుల నుండి ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరూ కరోనా భారినపడి కన్నుమూస్తున్నారు. తాజాగా ఓ తల్లికి కరోనా సోకిందని తెలియక ఆమెకి అంత్యక్రియలు నిర్వహించిన ఐదుగురు కొడుకులకి కరోనా సోకడం తో ఐదుమంది మృతిచెందారు. ఈ విషాదకరమైన ఘటన ఝార్ఖండ్ లో చోటుచేసుకుంది.

ఝార్ఖండ్ ధన్ బాద్ కు చెందిన 88 ఏళ్ల ఓ తల్లి అనారోగ్య సమస్యలతో భాదపడుతూ జులై 4 న హాస్పిటల్ లో కన్నుమూసింది. చనిపోయిన తరువాత ఆమెకి కరోనా నిర్దారణ టెస్టు చేశారు. కరోనా నిర్దారణ పరీక్ష అయితే చేశారు కానీ , ఆ రిపోర్ట్ రిజల్ట్ వచ్చేవరకు వేచి ఉండలేకపోయారు. తల్లి శవాన్ని తీసుకువచ్చి ఆచారం ప్రకారం ఐదుగురు కొడుకులు కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తరువాత ఆమెకి కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. దానితో వారికీ టెస్ట్ చేయగా ..ఐదుమంది అన్నదమ్ములకు కరోనా సోకినట్టు తెలిసింది. అమ్మ కి అంత్యక్రియలు నిర్వహించిన 16 రోజుల్లో ఒక్కొక్కరుగా ఆ ఐదుమంది కుమారులు మృత్యువాత పడ్డారు.
Tags:    

Similar News