పోలీసులకు వీక్లీ ఆఫ్ తొలగించడం పై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి సుచరిత వివరణ ఇచ్చారు. పోలీసులు ఎవరికి వారంతపు సెలవు రోజును తొలగించలేదని మంత్రి స్పష్టం చేశారు. కరోనా సమయంలో సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి విధులు నిర్వహించారని ఆమె గుర్తు చేశారు. ఆయా జిల్లాల ఎస్పీలు సిబ్బందికిచ్చే వీక్లి ఆఫ్ లు అమలు చేస్తారన్నారు. మంగళవారం గుంటూరు తూర్పు తహశీల్దార్ కార్యాలయాన్ని హోంమంత్రి ప్రారంభించారు.
2009 లోనే తహాశీల్దారు కార్యాలయం మంజూరు అయ్యిందన్నారు. ఇప్పుడు ప్రత్యేక భవనంలోకి మార్చామని తెలిపారు. అందరికీ అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. పెండింగ్ లో ఫైల్స్ ఉంచకుండా ప్రజలకి సేవలందించాలని హోంమంత్రి సుచరిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసులకు వారానికి ఒకరోజు సెలవు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దశాబ్దాలుగా చర్చల్లో నలుగుతున్న వారానికి ఒకరోజు సెలవు అంశాన్ని ఆచరణలో పెట్టడంతో పోలీసు వర్గాల్లో హర్షం వ్యక్తమైంది. బ్రిటిష్ పాలనలో రూపొందించిన 1859 నాటి మద్రాస్ పోలీస్ యాక్ట్‌ను ఆ తర్వాత సవరించారు. 1861లో ఆ చట్టం అమల్లోకి వచ్చింది.
ఆ తర్వాత దేశంలో, తెలుగు రాష్ట్రాలలో పలు మార్పులు జరిగినప్పటికీ కీలక చట్టాలు నాటి నుంచి అలానే కొనసాగుతున్నాయి. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అనంతరం 2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడినా, చట్టాల్లో మాత్రం పెద్దగా మార్పులు చేయలేదు. దాని ఫలితంగానే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న సిబ్బంది మాదిరిగా తమకు కూడా వారానికి ఒకరోజు సెలవు ఇవ్వాలని పోలీసు అధికారులు, సిబ్బంది డిమాండ్ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల హామీలో భాగంగా పోలీసులకు వీక్లీ ఆఫ్ ను అమల్లోకి తీసుకొచ్చింది. సుదీర్ఘ కాలంగా చర్చలకే పరిమితమవుతూ వస్తున్న ఈ అంశాన్ని అమలు జరుగుతుండడంతో పోలీసులకు కూడా వారానికి ఒకరోజు సెలవు దక్కింది.