ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు వీరే.?

Update: 2019-12-18 06:16 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంస్థాగత నిర్మాణం సహా పార్టీ బలోపేతం కోసం బీజేపీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకు త్వరలోనే కొత్త రాష్ట్ర అధ్యక్షులు రాబోతున్నట్టు సమాచారం.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ పదవీ కాలం ముగిసి పోయింది. పార్టీ నాయకత్వం మాత్రం అతడికి ప్రత్మామాయమైన బలమైన నేత కోసం శూలశోధన చేస్తోందట..ప్రధానంగా డీకే అరుణ, ఎంపీలు బండి సంజయ్, డి. అరవింద్ ల పేర్లు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి రేసులో వినిపిస్తున్నాయి.

ఈ ముగ్గురిలో డీకే అరుణ, అరవింద్ లు బీజేపీ లోకి కొత్తగా ప్రవేశించిన వారే. ఇక కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాత్రం 25 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ , ఏబీవీపీల నుంచి బీజేపీలోకి వచ్చి చురుకైన నేతగా ఎదిగారు. సంజయ్ బలమైన వినోద్ ను ఓడించి కరీంనగర్ ఎంపీగా గెలిచారు. అరవింద్ ఏకంగా కేసీఆర్ కూతురును ఓడగొట్టాడు.ఇక డీకే అరుణ మాత్రం పోటీచేసి ఓడిపోయింది.

ఈ ముగ్గురిలో డీకే అరుణ దూకుడుగా బీజేపీ చీఫ్ పదవి కోసం పోరుబాట పట్టారు. తెలంగాణలో మద్యపాన నిషేధం అమలు చేయాలని బీజేపీ నేతలందరినీ ఒక్కటి చేశారు.రాష్ట్రవ్యాప్తంగా డేర్ అండ్ డాషింగ్ నేతగా పేరున్నారు. పైగా మహిళా నాయకురాలు కావడం ఆమెకు ప్లస్.

ఇక ఏపీలో అధ్యక్ష రేసులో టీడీపీ మాజీలే ముందున్నారు. టీడీపీనుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, సిఎం రమేష్ ఇద్దరూ ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇద్దరూ ఇటీవల పార్టీలో చేరారు. ఏపీ బీజేపీ పాత కాపులు సోము విర్రాజు, మణిక్యాల రావు కూడా ఈ పోస్టు కోసం పోటీ పడుతున్నారు. రాజ్యసభ ఎంపి జివిఎల్ నరసింహారావు కూడా బరిలో ఉన్నారు. అయితే అన్ని వర్గాలు మాత్రం సుజనా చౌదరికే చాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నాయి. 
Tags:    

Similar News