అసెంబ్లీ, ఉప‌ ఎన్నిక‌ల ఫ‌లితాల సారాంశం ఇదే

Update: 2019-10-24 16:56 GMT
మహారాష్ట్రలో 288, హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. దీంతోపాటుగా, దేశవ్యాప్తంగా 51 అసెంబ్లీ స్థానాలకు, రెండు పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించింది. మహారాష్ట్రలో బీజేపీ కూట‌మి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. తుది ఫ‌లితాలు వెలువ‌డాల్సి ఉండ‌గా 288 స్థానాలకు గాను బీజేపీ, మిత్ర‌ప‌క్షమైన శివ‌సేన 158 స్థానాల్లో గెలుపొంది 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్, మిత్ర‌ప‌క్షమైన ఎంఎన్ఎస్‌లు 79 స్థానాల్లో విజ‌యం సాధించి 18 స్థానాల్లో ముందంజ‌లో ఉన్నాయి. ఇత‌రులు మిగ‌తా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. హ‌ర్యానాలో బీజేపీ 40 స్థానాలలో గెలుపొంద‌గా .. కాంగ్రెస్ 31 స్థానాలను కైవ‌సం చేసుకంఉది. హ‌ర్యానా జేజేపీ పార్టీ పది స్థానాల్లో గెలుపొందింది.

2014 ఎన్నికలతో పోల్చితే.. ఈసారి మహారాష్ట్రలో 3 శాతం పోలింగ్ తగ్గింది. అటు.. హర్యానాలో కూడా ఈసారి పోలింగ్ శాతం రికార్డు స్థాయిలో పడిపోయింది. 2014లో హర్యానాలో 76.54 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈ ఎన్నికల్లో 65 శాతం పోలింగ్ నమోదైంది. కాగా,  హ‌ర్యానాలో అధికార కైవసానికి మెజార్టీ బెంచ్‌మార్క్ 46 స్థానాలను సైతం బీజేపీ దక్కించుకోలేదు. ఈ నేపథ్యంలో ఫలితాల్లో పార్టీ వెనుకంజకు బాధ్యత వహిస్తూ అధ్యక్ష స్థానానికి హర్యానా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బారాలా రాజీనామా ప్రకటించారు. తాను పోటీ చేసిన తోహనా అసెంబ్లీ నియోజకవర్గంలో సైతం సుభాష్ బారాలా ఓడిపోయారు.

మ‌రోవైపు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మొత్తం 11 స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. అయితే ఐదు స్థానాల్లో బీజేపీ గెలుపొంది ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. స‌మాజ్‌వాదీ రెండు స్థానాల్లో, బ‌హుజ‌న్ స‌మాజ్‌, కాంగ్రెస్ పార్టీలు చెరో స్థానంలో లీడింగ్‌లో ఉన్నాయి.

మ‌రోవైపు తెలంగాణ‌లోని హుజుర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ గెలుపొందింది. ఆ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 43,284 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌ పద్మావతిరెడ్డిపై శానంపూడి సైదిరెడ్డి గెలుపొందారు. మొత్తం 22 రౌండ్లలోనూ సైదిరెడ్డినే ఆధిక్యం ప్రదర్శించారు.
Tags:    

Similar News