సినిమా టైటిళ్లలో తన పేరుతో తనకిచ్చిన పద్మశ్రీ అవార్డును వేసుకున్న ఉదంతంపై సినీ నటుడు మోహన్ బాబుకు సంబంధించి కేసు ఒకటి నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై హైకోర్టులో ఎదురు దెబ్బ తగలటంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ సందర్భంగా తాను పద్మశ్రీని దుర్వినియోగం చేయనని.. ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీం తాజాగా స్పందించింది. సినిమాల్లో తన టైటిల్‌తో పద్మశ్రీ వేయటానికి నిర్మాతలు కారణమని.. తనకు తెలీకుండా అలా జరిగిందని.. ఇకపై అలా జరగకుండా చూస్తానన్న ఆయన వాదనను సుప్రీం స్వాగతించింది.ఆయన ఇచ్చిన ఆఫిడవిట్ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టేసి.. మోహన్‌బాబుకు ఊరటనిస్తూ నిర్ణయం వెలువరించింది. మోహన్ బాబుకు పద్మశ్రీను కొనసాగించాలని పేర్కొంది. ఇంతకుమించిన సంతోషకరమైన విషయం పద్మశ్రీ మోహన్ బాబుకు ఇంకేం ఉంటుంది..!