మిస్టరీ మరణాలపై సుప్రీం కన్నేసింది

Update: 2015-07-07 09:53 GMT
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వ్యాపం కుంభకోణానికి సంబంధించి తాజాగా మరో పరిణామం చోటు చేసుకుంది. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటివరకూ 48 మంది అనుమానాస్పద రీతిలో మరణించిన నేపథ్యంలో.. ఈ వ్యవహారంపై దర్యాప్తు కోసం సీబీఐ విచారణకు ఇవ్వాలని సర్వత్రా వినతులు వెల్లువెత్తుతున్నా.. ఏన్డీయే సర్కారు మాత్రం ససేమిరా అంటోన్న సంగతి తెలిసిందే.

వ్యాపం వ్యవహారాన్ని సీబీఐ విచారణ అవసరం లేదంటూ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ తేల్చి చెప్పిన నేపథ్యంలో.. పలువురు నేతలు కలిసి ఈ రోజు ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌.. అమ్‌ఆద్మీ నేత కుమార్‌ బిస్వాస్‌తో పాటు మరో ఏడుగురు సుప్రీంనుఆశ్రయించారు. ఈ వ్యవహారాన్ని సీబీఐ దర్యాప్తుకు అప్పగించాలని వారు కోరుతున్నారు.

ఈ పిటీషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను అత్యున్నత న్యాయస్థానం ఈ నెల 9న విచారించనుంది. మరి.. అప్పటివరకూ మరెన్ని ఘోరాలు చోటు చేసుకుంటాయో..?

Tags:    

Similar News