ఇప్పుడు కానీ టీవీ చానళ్లు చూస్తే.. సరిగ్గా ఇదే మాటను అనుకోవాల్సిందే. వర్థమాన సినీనటి స్వాతి రెడ్డి ఫ్యామిలీకి చెందిన లొల్లి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకోవటమే కాదు.. ఆమె.. ఆమె తల్లి ఇద్దరు కలబడే వరకూ వెళ్లటం.. ఇలాంటి రియల్ సీన్ల కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూసే ఎలక్ట్రానిక్ మీడియాకు అవసరమైనంత ‘ఫుడ్’ దొరకటంతో.. దాదాపు అన్ని ఛానళ్లు స్వాతి రెడ్డిని ఫోకస్ చేశాయి.
లెజెండ్.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్.. ఉషోదయం లాంటి సినిమాలు చేసినా రాని గుర్తింపు గడిచిన గంటన్నర వ్యవధిలో ఆమెకు బాగానే వచ్చేసింది. ఈ కథను సింఫుల్ గా.. కాస్తంత బాగా అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే..
స్వాతి రెడ్డి అనే సినీనటి అమ్మ పేరు నాగేంద్రమ్మ. ఈమె కాస్త బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో తన కుమార్తె స్వాతి రెడ్డి మిస్ అయ్యిందంటూ ఫిర్యాదు ఇచ్చారు. గుంటూరుకు చెందిన శ్రీనివాసరెడ్డి తన కుమార్తెకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశారన్నది ఆమె తల్లి వాదన. దీనిపై వెంటనే రియాక్ట్ అయిన పోలీసులు దృష్టి సారించారు. అదే సమయంలో తన తల్లి చేసిన ఫిర్యాదుకు కౌంటర్ గా నటి స్వాతి రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. తల్లి మీద ఫిర్యాదు చేశారు. తానేమీ కిడ్నాప్ కు గురి కాలేదని.. తాను శ్రీనివాస్ ను ప్రేమిస్తున్నానని.. తన ఇష్టంతోనే ఇంటి నుంచి వెళ్లిపోయినట్లుగా ఆమె స్పష్టం చేశారు.
తన తల్లితో ఆర్థికంగా లెక్కలు తేడా వచ్చాయని.. అందుకే ఇంటి నుంచి వెళ్లినట్లుగా ఆమె పేర్కొన్నారు. అంతేకాదు.. తాను ప్రేమించిన శ్రీనివాసరెడ్డిని ఇష్టపూర్వకంగానే పెళ్లాడానని.. తానేమీ కిడ్నాప్ కు గురి కాలేదన్న విషయాన్ని స్పష్టం చేస్తూ.. తల్లి మీద ఫిర్యాదు చేశారు. కూతురు పోలీస్ స్టేషన్ కు వచ్చిన తల్లి నాగేంద్రమ్మ ఎమోషనల్ కావటం.. దీంతో తల్లీకూతుళ్ల మధ్య మాటా మాటా పెరగటం.. ఒకదశలో తల్లి మీదకు స్వాతి రెడ్డి వెళ్లటంతో అక్కడున్న పోలీసులు స్పందించి.. ఇద్దరిని సముదాయించారు.
ఈ మొత్తం వ్యవహారం వ్యక్తిగత అంశాలకు సంబంధించింది కావటంతో.. తల్లి కూతుళ్లకు బంజారాహిల్స్ పోలీసులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అదే సమయంలో ఇద్దరి ఫిర్యాదుల ఆధారంగా కేసు దర్యాప్తును పోలీసులు షురూ చేశారు.