చంద్ర‌బాబు జోడెద్దుల జ‌ర్నీ టీడీపీని గ‌ట్టెక్కిస్తుందా...!

Update: 2022-09-27 08:22 GMT
ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిపక్షం టీడీపీ జోరు పెంచాల‌నేది.. ఆ పార్టీ అదినేత చంద్ర‌బాబు వ్యూహం. దీనినే దాదాపు అంద‌రూ ఫాలో అవుతున్నారు. అయితే.. దీనికి తోడు..చంద్ర‌బాబు మ‌రో వ్యూహాన్ని కూడా రెడీ చేస్తున్నా ర‌నేది.. సీనియ‌ర్ల టాక్‌.  అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. పార్టీనిబ‌లోపేతం చేసేలా.. పాత కొత్త‌ల మేలు క‌ల యిక దిశ‌గా..చంద్ర‌బాబు అడుగులు వేస్తున్నార‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో యువ‌త‌ను ప్రోత్సహించ డంతోపాటు.. సీనియ‌ర్ల‌కు కూడా చాన్స్ ఇస్తున్నారు.

అంటే.. యువ‌త నుంచి కూడా సేవ‌లు తీసుకుంటున్నారు. వీరిని సోష‌ల్ విభాగంలో యాక్టివ్ చేస్తున్నారు.  అంతేకాదు.. వారి నుంచి కూడా ఆలోచ‌న‌లు తీసుకుంటున్నారు. దీంతో యువ‌త‌కు మంచి అవ‌కాశం ఇస్తున్నార‌నే  వారిలో సంతృప్తిని ఇస్తోంది.

ఇక సీనియ‌ర్ల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌భుత్వంపై నేరుగా ఎటాక్ చేసేందుకు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై గ‌ళం వినిపించేందుకు కూడా వారికి అవకాశం ఇస్తున్నారు. దీంతో పార్టీలో కొత్త పాత‌ల మేలు క‌ల‌యిక‌.. బాగుంద‌నే టాక్ వినిపిస్తోంది.

మ‌రోవైపు..ఎన్నారై టీడీపీ విభాగాల‌ను కూడా యాక్టివేట్ చేస్తున్నారు. వారి నుంచి కూడా సేవ‌లు పొందాల ని.. మాగ్జిమ‌మ్ రిజ‌ల్ట్‌.. మినిమ‌మ్ స్ట్రెస్ అనే సూత్రాన్ని పాటిస్తున్నారు. దీంతో పార్టీలో అన్ని వ‌ర్గాల‌కు.. యువ‌త‌కు.. సీనియ‌ర్ల‌కు.. అంద‌రికీ.. స‌మాన అవ‌కాశాలు క‌ల్పిస్తున్నారు.

ఫ‌లితంగా..పార్టీకి త్వ‌ర‌లోనే.. కొత్త ఊపు వ‌స్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన ఓటు బ్యాంకు ను కూడా సొంతం చేసుకుంటుంద‌ని చెబుతున్నారు.

వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లోనూ ఇదే సూత్రాన్ని అనుస‌రించాల‌ని భావించినా.. ప్ర‌భుత్వంలో ఉండి.. బిజీగా ఉండ‌డంతో ఈ రేంజ్‌లో దృష్టి పెట్టే అవ‌కాశం మాత్రం ద‌క్క‌లేదు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో పార్టీలో జోడెద్దుల స‌వారీ సాగ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఈ వ్యూహం ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News