అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని తహతహలాడుతున్న వారిలో డోనాల్డ్ ట్రంప్ ఒకరు. అధ్యక్ష ఎన్నికల బరిలో దిగేందుకు ఆ పార్టీ నుంచి ట్రంప్ తో పాటు టెడ్ క్రుజ్.. మార్కో రూబియోలు కూడా పోటీపడుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు.. ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నట్రంప్ మాటలు ఇప్పటికే పలు సందర్భాల్లో మంట పుట్టించటం తెలిసిందే.
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అంతిమంగా బరిలోకి దిగాలన్న ట్రంప్ తన సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇప్పటివరకూ అధిక్యంలో దూసుకెళుతున్న ఆయనకు తాజాగా ఎదురుదెబ్బ తగిలింది. లావాస్ రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ నామినేటింగ్ పోటీలో ఆయన వెనుకబడటం ఆసక్తికరంగా మారింది.
ట్రంప్‌కు ప్రధాన పోటీదారుగా ఉన్న క్రుజ్ 28 శాతం ఓట్లతో ఇక్కడ ప్రథమ స్థానంలో నిలిస్తే.. డోనాల్డ్ ట్రంప్ కు 24 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక.. ఫ్లోరిడాకు చెందిన సెనేటర్ మార్కో రూబియో 23 శాతం ఓట్లను చేజిక్కించుకొని మూడోస్థానంలో నిలిచారు. ఇదే రీతిలో మరికొన్ని రాష్ట్రాల్లో ట్రంప్ వెనుకబడితే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్స్ తరఫు బరిలోకి దిగే అవకాశాన్ని ట్రంప్ కోల్పోయే ప్రమాదం ఉంది.