గంటల వ్యవధిని మాత్రమే ఇచ్చి.. లాక్ డౌన్ ప్రకటన చేసిన తెలంగాణ రాష్ట్ర సర్కారు.. సాయంత్రం వేళలో లాక్ డౌన్ మార్గదర్శకాల్ని విడుదల చేసింది. లాక్ డౌన్ కు సంబంధించి ఏయే రంగాలకు మినహాయింపు ఇవ్వనున్న విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాకుంటే.. మెట్రో సర్వీసుల విషయంలో తెలంగాణ సర్కారు జారీ చేసిన జీవోకు.. హైదరాబాద్ మెట్రో సంస్థ విడుదల చేసిన మార్గదర్శకాలకు వ్యత్యాసం ఉండటం గమనార్హం. లాక్ డౌన్ ముగిసే వరకు మెట్రో సర్వీసులు బంద్ చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటనలో పేర్కొనగా.. లాక్ డౌన్ నియమావళికి అనుగుణంగా.. ఉదయం ఆరుగంటల నుంచి ఉదయం 8.45 గంటల వరకు గమ్యస్థానాలకు వెళ్లేలా వాహనాల రాకపోకలు ఉంటాయని పేర్కొన్నారు. మరి.. ఈ వ్యత్యాసం మీద ఎవరు స్పష్టత ఇస్తారో చూడాలి.
ఇదిలా ఉండగా.. లాక్ డౌన్ నేపథ్యంలో కేసీఆర్ సర్కారు జారీ చేసిన మినహాయింపు రంగాల్ని చూస్తే..
- వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు
- రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్.సి.ఐ.కి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు. అన్నిరకాల వ్యవసాయ రంగాలకు లాక్ డౌన్ వర్తించదు.
- వైద్య రంగంలో ఫార్మాసూటికల్ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులకు మినహాయింపు
- అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, వారి వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వాహనాలకు అనుమతి.
- గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ యధావిధిగా సాగుతుంది.
- విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలు యధావిధిగా పనిచేస్తాయి.
- జాతీయ రహదారుల మీద రవాణా యధావిధిగా కొనసాగుతుంది.
- జాతీయ రహదారులపై పెట్రోల్, డీజిల్ పంపులు నిరంతరం తెరిచే ఉంటాయి.
- కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్ కార్యకలాపాలకు మినహాయింపు
- ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మినహాయింపు
- ఉపాధిహామీ పనులు యధావిధిగా కొనసాగుతాయి.
- ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో పనిచేస్తాయి.
- గత లాక్ డౌన్ సమయంలో మాదిరిగానే బ్యాంకులు, ఏటీఎంలు యధావిధిగా పనిచేస్తాయి.
- అన్ని ముందస్తు అనుమతులతో జరిపే పెండ్లిళ్లకు గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతి
- అంత్యక్రియల సందర్భంలో గరిష్టంగా 20 మందికి మాత్రమే అనుమతి
- తెలంగాణ చుట్టూ.. రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటుకు నిర్ణయం
- ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నిరకాల ఆర్టీసీ ప్రజా రవాణా అందుబాటులో ఉంటుంది.
- ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయి.
- కుకింగ్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ సరఫరా యధావిధిగా ఉంటుంది.