తెలంగాణవ్యాప్తంగా గత ఆరునెలలుగా వినిపిస్తున్న పేరు ఈటల రాజేందర్. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక నేత అయిన ఈటల రాజేందర్ మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ అయ్యారు. దీంతో ఆయన పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈనెల 30న ఎన్నిక నిర్వహించగా 2న ఫలితాలు విడుదలయ్యాయి. అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ మెజారిటీతోనే ఈటల విజయం సాధించారు. దీంతో నియోజకవర్గంలో ఏడుసార్లు గెలుపొందిన నేతగా రికార్డుల్లోకెక్కారు. అయితే ఈటల రాజేందర్ విజయానికి కారణాలను రకరకాలుగా చెబుతున్నారు. మీడియా, సోషల్ మీడియాలో ఆయన గెలుపుపై జోరుగా చర్చ సాగుతోంది. ఓవరాల్ గా కొన్ని కారణాలు ఈటల రాజేందర్ విజయానికి కారణమయ్యాయని అంటున్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల్లో కాస్త వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ ను మంత్రి వర్గం నుంచి భర్త్ రఫ్ చేయడంతో ఆయన తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ప్రచారం చేశారు. వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లారు. టీఆర్ఎస్ పార్టీ అహంకారంతోనే తనను ప్రభుత్వం నుంచి వెళ్లగొట్టారని చెప్పడంతో ప్రజల్లో సానుభూతి పెరిగింది. దీంతో తనను ప్రజలే విజయం సాధిస్తారని చెబుతూ వచ్చారు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల ఆ తరువాత నియోజకవర్గం నుంచి బయటికి వెళ్లలేదు. గడపగడపకు తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. ఇప్పటి వరకు ఆరుసార్లు గెలిపించి మీరు, ఇప్పుడు గెలిపిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అవకాశం ఉంటుందని ప్రచారం చేశారు. దీంతో ప్రజలు ఈటలపై బాగా నమ్మకం పెట్టుకున్నట్లయింది. ఇలా అన్ని వర్గాలను ఈటల ఆకట్టుకోగలిగారు. ఆయన సొంత గ్రామం కమలపూర్ కేంద్రంగా ఎన్నో ఏళ్లుగా చేస్తున్న రాజకీయాలు ఆయనకు అనుకూలంగానే ఉన్నాయి. దీంతో ఓటు బ్యాంకు కదలకుండా ఈటలకే వెళ్లింది.
ఈటల రాజేందర్ ను ఓడించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం శత విధాల ప్రయత్నించింది. ఇందుకు ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా కేసీఆర్ హుజూరాబాద్లో పర్యటించి మరీ దళిత బంధు ఫైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. దళిత ఓట్లు ఆకట్టుకోవాలని ఈ పథకం ప్రవేశపెట్టారని ఈటల రాజేందర్ ప్రచారం చేశారు. అయినా అది ప్రజలకు న్యాయం చేకూరుతుందని అన్నారు. అయితే మిగతా వర్గాలు మాత్రం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే కులాల వారీగా టీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. కమ్యూనిటీ భవనాలు నిర్మించడానికి పండ్స్ ను జారీ చేశారు. ఆటోనగర్, డబుల్ బెడ్ రూం లాంటి పథకాలు వర్తింపజేశారు.
అయితే ఇన్ని రోజులు నియోజకవర్గాన్ని పట్టించుకోని ప్రభుత్వం కేవలం ఈటల రాజేందర్ రాజీనామాతోనే చేస్తున్నారన్న భావన ప్రజల్లోకి వెళ్లింది. అంతేకాకుండా తాను రాజీనామా చేస్తేనే ఇన్ని పథకాలు వస్తున్నాయి.. ఇక ప్రభుత్వంపై పోరాడితే ప్రజలకు మరింత న్యాయం అవుతుందని ఈటల ప్రచారం చేశారు. ఈ ప్రచారం ఆయనకు అనుకూలంగా మారింది.
ఇక ఈటలను ఓడించేందుకు టీఆర్ఎస్ తరుపున గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను బరిలో ఉంచారు. ఈయన ఒకప్పుడు ఈటల ప్రధాన అనుచరుడు. అయితే నియోజకవర్గ ప్రజలు మాత్రం సీనియర్ అయిన ఈటల రాజేందర్ వైపే మొగ్గు చూపారు. ఇక కాంగ్రెస్ పార్టీ లేట్ గా అభ్యర్థిని ప్రకటించడంతో పాటు అనుకున్న విధంగా ప్రచారం చేయలేకపోయింది. దీంతో ఆ పార్టీ తరుపున నిల్చున బల్మూరి వెంకట్ ను ప్రజలు ఆదరించలేకపోయారు. దీంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం ఈటల వైపే వెళ్లింది. ఇలా ఈటల రాజేందర్ గెలుపునకు రకరకాల కారణాలను విశ్లేషిస్తున్నారు.