తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక ప్రచారంలో చంద్రబాబునాయుడు వారం రోజుల పాటు ఫుల్లు బిజీ అయిపోతున్నారు. ఈనెల 7 గానీ లేదా 8వ తేదీన గాని తిరుపతి చేరుకుంటారు. ముందుగా తిరుమల వెళ్ళి శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత తిరుపతి నుండి ప్రచారం మొదలుపెడతారు. తర్వాత రోజుకో అసెంబ్లీ నియోజకవర్గంలో స్ధానిక నేతలతో కలిసి ప్రచారాన్ని జోరెత్తిస్తారు.
9వ తేదీన నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు, 10వ తేదీన సూళ్ళూరుపేట నియోజకవర్గం, 11వ తేదీన వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు, 12 చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, 13న నెల్లూరు జిల్లాలోని గూడూరు, 14న తిరుపతిలో ప్రచారం చేస్తారు. చంద్రబాబు ప్రచారం చేసే ప్రాంతాల్లో జనసమీకరణకు సంబంధిచి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్ధానిక నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఉపఎన్నికలో గెలుపు విషయాన్ని పక్కనపెట్టేసినా మొన్నటి ఎన్నికల్లో వచ్చిన 4.94 లక్షల ఓట్లను సాధించటమే పార్టీకి ఇపుడు పెద్ద సవాలుగా మారింది. ఇందుకోసం అనేక మార్గాల్లో వ్యూహాలను రచిస్తు నేతలను మోహరించారు. పార్టీలోని మొత్తం ఎంఎల్ఏలను, ఎంపిలను, సీనియర్ నేతలను ఎన్నికల ప్రచారంలో మోహరించారు. పోలింగ్ కు ముందు వారంనుండి చంద్రబాబు చేయబోతున్న శుడిగాలి పర్యటనలు, ప్రచారంతో పార్టీలో ఊపొస్తుందేమో చూడాలి.