వరంగల్ ఉప ఎన్నికల ఓట్ల ఫలితం సంచలనం సృష్టించేలా కనిపిస్తోంది. అధికారపక్ష నేతలు ఎవరూ ఊహించనంత భారీ విజయాన్ని టీఆర్ ఎస్ సొంతం చేసుకోనున్నట్లు కనిపిస్తోంది. మంగళవారం ఉదయం 8 గంటలకు మొదలైన ఓట్ల లెక్కింపు.. గంట.. గంట గడుస్తున్న కొద్దీ తిరుగులేని అధిక్యంతో దూసుకెళ్లిపోతోంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వరంగల్ లోక్ సభా నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ లలో మూడు అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ ఎస్ కు ఎదురుదెబ్బ తగలొచ్చన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే.. దీనికి భిన్నమైన ఫలితం తాజా ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎదురుకావటం విశేషం. మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ టీఆర్ ఎస్ అభ్యర్థి తిరుగులేని అధిక్యతను ప్రదర్శిస్తున్నారు.
ఉదయం పదకొండు గంటల సమయానికి టీఆర్ ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 3 లక్షల అధిక్యతను టచ్ చేసేశారు. టీఆర్ ఎస్ కు పోలైన ఓట్లు 3లక్షల మార్క్ ను ఉదయం 10.40కే దాటిపోగా.. మూడు లక్షల అధిక్యాన్ని 11 గంటల సమయంలో టచ్ చేశారు. ప్రస్తుతం నెలకొన్న ట్రెండ్ చూస్తుంటే.. రికార్డు స్థాయి అధిక్యాన్ని సాధించే దిశగా కారు దూసుకెళుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.