నిరుద్యోగులు.. వలంటీర్ల పోస్టులిక నిత్యం

Update: 2019-10-26 07:23 GMT
గతంలో నియామకాలు చేపట్టిన గ్రామ వలంటీర్ పోస్టులకు సంబంధించి పలు కారణాలతో ఖాళీ అయిన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 13 జిల్లాల పరిధిలో మొత్తం 9674 గ్రామ వలంటీర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నవంబర్ 1 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు నవంబర్ 10 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 15 నుంచి అభ్యర్థుల దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తారు. నవంబర్ 16నుంచి 20 వరకు ఎంపిక చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులు డిసెంబర్ 1 నుంచి విధుల్లో చేరాల్సి ఉంటుంది.

అయితే ఎంతో సదాశయంతో జగన్ సర్కారు ప్రవేశపెట్టిన ఈ గ్రామ వలంటీర్ల పోస్టులు నిత్య యవ్వనంగా ఖాళీల భర్తీకి ప్రభుత్వం పూనుకుంది. అయితే కొందరు వేరే ఉద్యోగాలకు వెళ్లడంతో ఈ ఖాళీలు అనివార్యమవుతున్నాయి. కొందరు జీతం తక్కువ, పని పడక బంద్ చేస్తున్నారు.

పోయినసారి ఏపీలో 1,94,592 గ్రామ వలంటీర్లను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. అయితే వారిలో 1,84,944 మంది మాత్రమే విధుల్లో చేరారు. 9648 ఖాళీలు ఏర్పడ్డాయి. చివరకు ఖాళీల సంఖ్యను 9674 గా అధికారులు నిర్ణయించారు.

అయితే ఈ పోస్టులకు సంబంధించి అభ్యర్థులు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. అందుకే పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం విద్యార్హతను తగ్గించడానికి పూనుకుంది. ఏర్పడే ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని.. ఇందుకోసం ఇంటర్మీడియెట్ ను అర్హతగా తగ్గించాలని అధికారులు యోచిస్తున్నారు. ఏది ఏమైనా ఉద్యోగాలు ఇస్తున్నా చేరని వైనం వలంటీర్ పోస్టులలో కనిపిస్తోంది. విద్యార్హత తగ్గిస్తే అయినా చేరుతారేమో చూడాలి.
Tags:    

Similar News