వ‌చ్చే ఏడాదిలో భారీగా భూకంపాలు

Update: 2017-11-21 05:07 GMT
కొత్త సంవ‌త్స‌రం వ‌స్తుందంటే కొత్త కొత్త ఆశ‌లు.. ఆలోచ‌న‌ల‌తో తెగ ఊహించేసుకుంటాం. అయితే.. వ‌చ్చే ఏడాది మాత్రం అలాంటి ఆశ‌లు ఎక్కువ పెట్టుకోవ‌ద్ద‌న్న‌ట్లుగా తాజా స‌మాచారంగా చెప్పాలి. మ‌రో నెల‌న్న‌ర‌లో రానున్న కొత్త సంవ‌త్స‌రంలో భారీ విధ్వంసాలు.. ప్ర‌కృతి బీభ‌త్సాలు త‌ప్ప‌వ‌న్న విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టేశారు.

వ‌చ్చే ఏడాది (2018)లో ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ భూకంపాలు చోటు చేసుకునే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించారు భౌగోళిక శాస్త్ర‌వేత్త‌లు. ఏడాదికి స‌గ‌టున 15 వ‌ర‌కు తీవ్ర‌స్థాయి భూకంపాలు ఉంటాయ‌ని.. తాజా అంచ‌నా ప్ర‌కారం వ‌చ్చే ఏడాది భారీ ఎత్తున భూకంపాలు విరుచుకుప‌డ‌తాయ‌ని చెబుతున్నారు.

యూనివ‌ర్సిటీ ఆఫ్ కొల‌రాడో వ‌ర్సిటీ ఆఫ్ మోంటానాకి చెందిన శాస్త్ర‌వేత్త‌లు తాజాగా భూకంపాల మీద ప‌రిశోధ‌న చేశారు. 1900 నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ 7 తీవ్ర‌త‌తో కూడిన భూకంపాల్ని వారు అధ్య‌య‌నం చేశారు. శాస్త్ర‌వేత్త‌లు రాబ‌ర్ట్ బిల్హ‌మ్‌.. రెబెక్కాలు చేసిన ప‌రిశోధ‌న‌ల కార‌ణంగా ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

భూభ్ర‌మ‌ణ వేగం ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు లేదంటే త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు 7 తీవ్ర‌త‌తో కూడిన భూకంపాలు సంభిస్తాయ‌ని తాము గుర్తించిన‌ట్లు వెల్ల‌డించారు. అంతేకాదు.. భూకంపాలు జ‌నాభా ఎక్కువ ఉండే ప్రాంతాల్లో రావ‌టానికి ఎక్కువ అవ‌కాశం ఉంద‌న్న మాట‌ను చెప్పారు.

ప్ర‌తిరోజూ ప్ర‌తి అర‌క్ష‌ణానికి భూభ్ర‌మ‌ణ వేగం మారుతూ ఉంటుంద‌ని.. వేగం మ‌రింత ఎక్కువ‌గా అయినా త‌క్కువ‌గా అయినా ఉండే వెంట‌నే భారీ భూకంపాలు చోటు చేసుకునే వీలుంద‌ని వారు వెల్ల‌డించారు. ప్ర‌తి 32 ఏళ్ల‌కు ఒక‌సారి భారీ తీవ్ర‌త‌తో భూకంపాలు వ‌స్తుంటాయ‌ని.. ప్ర‌తి ఐదేళ్ల‌కు ఒక‌సారి భూభ్ర‌మ‌ణ వేగం మారుతూ ఉంటుంద‌న్నారు. నాలుగేళ్లుగా భూభ్ర‌మ‌ణ వేగం త‌క్కువ‌గా ఉంద‌ని కాబ‌ట్టి స‌రాస‌రిన ప్ర‌తి ఏటా పెద్ద భూకంపాలు 15 మాత్ర‌మే వ‌చ్చాయ‌ని చెప్పిన వారు.. 2018 నాటికి ఐదో సంవ‌త్స‌రం అవుతుంద‌ని.. ఈ కార‌ణంగా వ‌చ్చే ఏడాది 20 నుంచి 30 తీవ్ర‌మైన భూకంపాలు వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని వార్నింగ్ ఇస్తున్నారు. 2018 సంవ‌త్స‌రం ప్ర‌పంచానికి ఒక పీడ‌క‌ల‌గా నిలుస్తుంద‌న్న‌ట్లుగా ఉన్న వీరి మాట‌లు స‌గ‌టుజీవిని భ‌య‌పెట్ట‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 
Tags:    

Similar News