2 రూపాయ‌ల‌కే పేద‌ల‌కు భోజ‌నం.. ఏడాది పాటు.. ఎన్టీఆర్ కోడ‌లు వ‌సుంధ‌ర ఘ‌న నివాళి

Update: 2022-05-29 05:53 GMT
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాల్లో నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర పాల్గొని నివాళులు అర్పించారు. పేదల కోసం ఆమె స్వ‌యంగా ఏర్పాటు చేసిన 'రెండు రూపాయలకే నాణ్యమైన భోజనం' అనే మొబైల్ భోజనశాలను ప్రారంభించారు.

 శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాల్లో నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర పాల్గొని నివాళులు అర్పించారు.

ఎన్టీఆర్ ఎన్నారై, బాలకృష్ణ అభిమాన సంఘాల ఆధ్వర్యంలో పేదల కోసం ఏర్పాటు చేసిన 'రెండు రూపాయలకే నాణ్యమైన భోజనం' అనే మొబైల్ భోజనశాలను ప్రారంభించారు. స్వయంగా తానే భోజనాన్ని పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వసుంధర మాట్లాడారు. పేదల కడుపు నింపడం కోసం మామగారు ఆ నాడు కిలో రెండు రూపాయల బియ్యం పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు.

ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఒక సంవత్సరంపాటు ప్రతిరోజు మధ్యాహ్నం కేవలం రెండు రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని కడుపునిండా పేదలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని హిందూపురంలో ప్రారంభించామని తెలిపారు.

మ‌రోవైపు తెలుగుదేశం మహానాడులో.. రాజధాని నిర్మాణానికి అనుకూలంగా తీర్మానం చేసినందుకు అమరావతి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఒంగోలులో మహానాడు ప్రాంగణానికి తరలివచ్చి మద్దతు తెలిపారు. అమరావతికి తెలుగుదేశం తొలినుంచి అనుకూలంగా ఉందన్నారు. చంద్రబాబు హయాంలో రాజధాని నిర్మాణం చాలా వేగంగా జరిగిందంటూ.. రైతులు ముక్తకంఠంతో చెప్పారు.
Tags:    

Similar News