కళలకు హద్దులు ఉండవు కానీ దేశానికి సరిహద్దులు ఉంటాయి.. ఈ సంగతి అందరూ గుర్తుంచుకోవాలి.. ఈ సందర్భంలో మీడియా స్వేచ్ఛ అనేది దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండకూడదు.. సమాజంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన విధంగా మీడియా ప్రసారాలు ఉండాలేతప్ప - పరిమితులను మీరి ఎవరైనా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు. హైదరాబాద్ లో ఉర్దూ పాత్రికేయుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వ్యాఖ్యానించిన వెంకయ్య... న్యూస్ లో వ్యూస్ ఉండకూడదనీ - వార్తల్ని కేవలం వార్తల్లా మాత్రమే ప్రెజెంట్ చేయాలని, సొంత అభిప్రాయాలు ఏవైనా ఉంటే వాటిని ఎడిటోరియల్ పేజీల్లో రాసుకోవాలని సూచించారు. అయితే ఈ సందర్భంగా వెంకయ్య... ముందుగా దేశం - దేశ పౌరుడే ముఖ్యం - ఆ తరువాతే మీడియా అని అన్నారు! ఇవన్నీ చూస్తుంటే... మీడియా కథనాల విషయంలో కేంద్రం కటువుగానే వ్యవహరిస్తుందని అర్థమౌతోంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం మూడు ఛానల్స్ పై కేంద్రం నిషేదం విదించిన సంగతి తెలిసిందే. అయితే... ఇప్పుడు దృష్టి ఏపీలో ఛానల్స్ పైకి మళ్లే అవకాశం ఉందా? అనే అనుమానాలు పలువురు వ్యక్తపరుస్తున్నారు. దానికీ బలమైన కారణాలు లేకపోలేదు!! ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో బీజేపీ నమ్మకద్రోహం చేసిందని, ప్యాకేజీ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతుందని, హోదా కి మరేదీ సాటిరాదని ఒక తెలుగు మీడియా పోరాటం చేస్తుంది.. ప్రతిపక్షం చేస్తోన్న పోరాటనికి పూర్తి మద్దతు ఇస్తుంది. ప్యాకేజీ కంటే హోదా గొప్పది కాదని కేంద్రం చెబుతున్నా సదరు మీడియా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు! ఇదే క్రమంలో వారి మీడియాలో నిత్యం ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరిని ఎండగడుతూ బోలెడన్ని కథనాలు - కార్యక్రమాలు వేస్తున్నారు. అవి కచ్చితంగా కేంద్రం వైఖరికి విరుద్ధంగా ఉన్నాయని భావించి, విస్తృత ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని కేంద్రపెద్దలు నిర్ధారిస్తే.. సదరు మీడియా సంస్థపై కూడా కేంద్రం ఉరిమే ప్రమాదం ఉందా? అనే సందేహాలు మరికొందరు వ్యక్తపరుస్తున్నారు. ఇదే సమయంలో కేంద్రంలో ఉన్న బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న రాష్ట్రంలోని అధికార పార్టీకి కూడా ఆ మీడియా సంస్థ కొరకరాని కొయ్యగా మారింది!! దీంతో ఆ మీడియా పై కేంద్రం కన్నెర్ర చేస్తుందేమో అని అనుమానాలు ఆన్ లైన్ వేదికగా పలువురు వ్యక్తపరుస్తున్నారు!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/