ఇప్పటికింకా ఏమీ తేలలేదు. ఇకపై కూడా తేలుతుందని చెప్పలేం. బీజేపీ మాత్రం వీలున్నంత వరకూ పవన్-తోనే ఉంటుంది. కానీ 2014 ఈక్వేషన్ పైనే ఇంకా స్పష్టత లేదు. పవన్ మాత్రం తనతో పాటు తన అభ్యర్థుల గెలుపు కూడా కీలకం అని అనుకుంటున్నారు. అదేవిధంగా అభిమానుల మాట కూడా ఓ వైపు వినిపించుకుంటున్నారు. సీఎం అభ్యర్థిగా పవన్ ను మాత్రమే ఉంచాలని వాళ్లంతా కోరుకుంటున్నారు.
ఒకవేళ హంగ్ ఏర్పాటయితే అధికార పంపిణీకి ఇరు వర్గాలూ అంగీకరిస్తాయా ? ఏమో గుర్రం ఎగరావచ్చు. చంద్రబాబు మనసులో మాత్రం పవన్ తోవెళ్తే కొన్ని చో ట్ల మరింత మెరుగయిన ఫలితాలు అందుకోవచ్చు అని భావిస్తున్నారు.
కానీ బాబు ఆశలను గ్రహించి, కాస్త తెలివిగానే జగన్ వ్యవహరించి, అవతలి పార్టీ వ్యూహాలకు చెక్ పెట్టారన్న అభిప్రాయం ఒకటి విశ్లేషకుల నుంచి వస్తోంది. ఏదేమయినప్పటికీ పవన్ తో పొత్తుకు టీడీపీ సిద్ధంగానే ఉన్నా కూడా, ఈ సారి చంద్రబాబు ఏ మేరకు జనసేనకు సాయం చేస్తారు అన్నదే చర్చకు తూగే విషయం. ఓట్లు చీలితే ఒక విధంగా నష్టపోయేది టీడీపీ మాత్రమేనని పదే పదే జనసేన అంటున్నది కూడా ఇందుకే !
టీ కప్పులో తుఫాను మాదిరిగా ఉంది రాజకీయం. ఎప్పుడు ఏమౌతుందో తెలియని సందిగ్ధతలే ఉన్నాయి. అందుకే నిన్నమొన్నటి వరకూ టీడీపీ తో పవన్ వెళ్తారని అనుకున్నాక కొన్ని సమీకరణలు కూడాయి కూడా ! కానీ ఇంతలో వైసీపీ ర్యాగింగ్ తీవ్రతరం కావడంతో పవన్ వెనుకంజ వేశారు. జగన్ మనుషులు అదే పనిగా దత్తపుత్రుడు అనే కాన్సెప్ట్ ను తమ మీడియా ద్వారా ప్రజల్లోకి ఇంజెక్ట్ చేసేందుకు, తద్వారా ఓటరును ప్రభావితం చేసేందుకు కొంత వరకూ ప్రయత్నించారని, ఇదే పొత్తులకు బ్రేక్ పడేందుకు కారణం అయిందని ఓ వాదన.
కొంతవరకూ పవన్ కల్యాణ్ చేతిలోనే పొత్తుల విషయం ఉంది. ఆ మాటకు వస్తే టీడీపీ మాత్రం ఒంటరిగా పోతే పోయేదేముంది అన్న వాదనతో ఉంది. ఇప్పుడు ఎవరు ఎటు ఉన్నా కూడా నెగ్గుకు రావడం అన్నది అంత సులువు కాదు. కనుక ఎవరికి వారు పంతాలు వీడి పద్ధతిగా కలిసి ప్రయాణిస్తే కాస్త మంచి ఫలితాలే రావొచ్చు అన్నది ఓ పరిశీలక వర్గం అభిప్రాయం.
ఇప్పటిదాకా చంద్రబాబు ఎక్కడా వీటి గురించి మాట్లాడక పోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది అని ప్రధాన మీడియా అంటోంది. ఇప్పటి నుంచి మాట్లాడితే జగన్ సేనకు అనవసరంగా అస్త్రాలు అందించినవిధంగా అవుతుందని భావిస్తున్నారాయన.అందుకే ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పడం లేదు. రానున్న కాలంలో చంద్రబాబును దాటించి పవన్ ఒంటరిగా పోయే అవకాశాలున్నా కూడా, వీలున్నంత వరకూ మిత్ర ధర్మంను వదులుకునే ఛాన్సులయితే లేవు.