తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఘనంగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో ప్రతీ పల్లెలో గ్రామంలో కూడా ఉత్సవాల సందడి బాగా కనిపిస్తోంది. ఎటు చూసినా పసుపు జెండాలు ఎగురుతున్నాయి. టీడీపీ ఓడి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ వచ్చిన ఈ ఫార్టీ ఇయర్స్ ఈవెంట్ క్యాడర్ లో కసిని పట్టుదలను పెంచేదిగా ఉంది.
దాంతో ఎటు చూసినా టీడీపీకి జై అన్న నినాదాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా విశాఖలోని పార్టీ ఆఫీస్ లో జరిగిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్గొనడంతో అంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోను అయ్యారు.
నిజానికి గంటా టీడీపీ ఎమ్మెల్యే. పైగా మంత్రిగా గత టెర్మ్ లో అయిదేళ్లూ పనిచేశారు. ఆయన సొంత పార్టీ ఆఫీస్ కి రావడం వెనక విడ్డూరం ఏమీ లేదు. అయితే గంటా గత రెండేళ్ళుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. తనను గెలిపించిన విశాఖ ఉత్తర నియోజకవర్గంలోనూ ఇంచార్జినే ముందు పెట్టి కధ నడిపిస్తున్నారు.
మరో వైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమ వేళ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇపుడు ఆ రాజీనామా ఆమోదం కోసం న్యాయ పోరాటం చేస్తారని కూడా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కాపు సంఘాల నేతల సమావేశలతో బిజీగా ఉంటున్న గంటా ఇపుడు సడెన్ గా టీడీపీ ఆఫీస్ గడప తొక్కడం పట్ల క్యాడర్ ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా వ్యక్తం చేస్తోంది.
ఎందుకంటే గంటా లాంటి బిగ్ షాట్ పార్టీలో ఉండాలని అంతా కోరుకుంటున్నారు. ఆయన కూడా తాను పార్టీని వీడిపోతున్నాను అని ఎక్కడా చెప్పలేదు కానీ పార్టీ యాక్టివిటీస్ ని బాగా తగ్గించేశారు. మరి నలభయ్యవ పార్టీ వేడుకల వేళ గంటా పార్టీ ఆఫీస్ కి రావడం అంటే ఆయన తిరిగి తన జోరు పెంచుతారు అని అనుకోవచ్చు అని అనుచరులు అభిమానులు అంటున్నారు.
మరో వైపు చూస్తే గంటా మాట్లాడుతూ టీడీపీ ఏర్పాటుతోనే ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది అని అన్నారు. టీడీపీ ఏపీకి చేసిన సేవలను ఆయన కొనియాడారు. మొత్తానికి గంటా మాటలు క్యాడర్ లో కొత్త జోష్ ని నింపాయి. రానున్న రోజుల్లో గంటా ఇదే స్పీడ్ చూపిస్తారా అన్నది చర్చగా ఉందిపుడు.