మూడు ప్రధాన పార్టీలు.. టీఆర్ ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయతే, వీటికి ఇప్పుడు 'ఓట్ల చీలిక' చింత పట్టుకుంది. బరిలో ఎక్కువ మంది ఉండటం.. అందులోనూ చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఉండటంతో ఎవరిపై ప్రభావం పడుతుందనే చర్చ జరుగుతోంది. వారు ఎవరి ఓట్లను చీల్చే అవకాశం ఉంది, అందువల్ల ఎవరికి లాభం జరుగుతుందనే దానిపై అంచనాలు వేసుకుంటున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికివారు తామే గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నా.. లోలోపల అందరిలో ఆందోళన కనిపిస్తోంది. క్రాస్ ఓటింగ్ భయం పార్టీలను వేధిస్తోంది. అందుకే ప్రధాన పార్టీలన్నీ ఓట్లు చీలిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
ఈ ఉప ఎన్నికలో మొత్తం 47 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇందులో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు జాతీయ పార్టీ అయిన బీఎస్పీ నుంచి ఒకరు కలిపి నలుగురు ఉండగా.. రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు 10 మంది వరకు ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ముందు 83 మంది బరిలో ఉన్నా.. ప్రధాన పార్టీలు 36 మంది స్వతంత్రులను ఒప్పించి బరిలో నుంచి తప్పించగలిగాయి. అయినా పెద్ద సంఖ్యలో ఇండిపెండెంట్లు పోటీలో నిలిచారు. మొత్తంగా ప్రధాన పార్టీలు మినహా మిగతా 44 మంది అభ్యర్థులు ఎవరి ఓట్లను చీల్చుతారన్నది కీలకంగా మారింది.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ హవా కనిపించినా మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. బీజేపీ మూడో స్థానంలో నిలిచింది.
రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరడంతో ప్రస్తుత ఉప ఎన్నికల్లో పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్‌కు చెందిన గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నాయకులను, ప్రజాప్రతినిధులను వీలైనంత మందిని టీఆర్ఎస్, బీజేపీ తమవైపు తిప్పుకొన్నాయి.
అయినప్పటికీ ఎన్నికల పోలింగ్ రోజు పరిస్థితి ఎలా ఉండబోతుందోనన్న స్పష్టత లేదు. ఈ క్రమంలో గత ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి? ఏ గుర్తుపై ఎన్ని ఓట్లు పడ్డాయి? క్రాస్ ఓటింగ్ ఎక్కడ జరిగిందన్న లెక్కలు తీసుకున్నాయి.
ఇక, టీఆర్ఎస్‌కు ఈసారి సీపీఐ, సీపీఎం మద్దతు ఇస్తున్నా క్షేత్రస్థాయిలో ఆ పార్టీల ఓటర్లు ఎటువైపు మొగ్గుతారన్నది అంతుచిక్కడం లేదు. ఆ పార్టీ తమ ఓటు బ్యాంకుతోపాటు కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలపై ఆశలు పెట్టుకుంది. ఇక, బీజేపీ గతంలో రాజగోపాల్‌రెడ్డికి పడిన కాంగ్రెస్ ఓట్లపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. కానీ నాయకులు పోయినా కేడర్ ఉందని, ఓట్లు తమకే పడతాయని కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.