‘అనంత’ నుంచి మినిస్టర్ రేసులో ఐదుగురు.. జగన్ ఎవరికి ఛాన్స్ ఇస్తారో..!?

Update: 2021-10-02 23:30 GMT
మంత్రి పదవి అంటే ఎవరి ఇష్టం ఉండదు. ప్రతి ఎమ్మెల్యే మంత్రిని కావాలని కోరుకుంటారు. మంత్రి పదవి ఉన్న క్రేజ్ అంత గొప్పది మరీ. ఎమ్మెల్యే పరిధి చాలా చిన్నది. అదే మంత్రి అయితే రాష్ట్రం మొత్తం తన అదుపులో ఉంటుంది. కాసులు కురిపించే మంత్రి పదవి అయితే మహదానందం. ఇక కొన్ని మంత్రిత్వ శాఖాల్లో అయితే కాసులకే కష్టం .. ఆయా శాఖల నుంచి పెద్దగా రాబడి ఉండదు. ముందుగా రాబడి ఉన్న మంత్రిత్వ శాఖను భర్తీ చేస్తారు. ఆ తర్వాత కోశం లేని శాఖలను పూరిస్తారు. ముందు వరుసలో ఉన్న శాఖాలపై అందరూ ఆతృతగా ఎదురు చూస్తారు. ఈ శాఖల భర్తీలో ముఖ్యమంత్రి ఆయన సలహాదారులు ఆచితూచి వ్యవహరిస్తారు. ఎందుకంటే విషయ పరిజ‌్ఞానంతో పాటు విపక్షాలకు ధీటుగా సమాధానం చెప్ప సత్తా ఉండాలి. అవి ఉన్న డేరింగ్ నేతలకే ఆయా శాఖలను అప్పగిస్తారు. ఇక రెండో వరుసలో ఉన్న శాఖలను అసంతృప్తి నేతలను సముదాయించేందుకు వారికి కేటాయిస్తారు. ఇక వీళ్ల కూడా అయిష్టంగానే ఆ కొలువుల్లో కొనసాగుతుంటారు. పేరు ముందు మంత్రి ఉంది కాదా సంతృప్తితో ఉంటారు. అందుకే మరీ మంత్రి అంటే మాములుగా ఉండదు. ఆ దర్పం, హోదా, పలుకుబడి, శాషించే అధికారంతో పాటు తన స్వంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుంది. అందువల్లే ఏదో ఒక రోజు మంత్రిగా ప్రమాణాస్వీకారం చేయాలని ఎమ్మెల్యేలందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అసలు విషయానికి వద్దాం..

సీఎం జగన్ ముందుగా తీసుకున్న నిర్ణయం ప్రకారం రెండున్నళ్లే తర్వాత తన కేబినెట్‌లో 80, నుంచి 90 శాతం వరకు మార్పులు చేర్పులుంటాయని ప్రకటించారు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. అందుకే ఆశావాహులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆశావాహులు ఆశగా ఎదురుచూస్తుంటే.. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గలో టెన్షన్ మొదలైంది. జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, తమ మంత్రిపదవులు పోయినా పర్వాలేదు.. సీఎం నిర్ణయాన్ని శిరాసవహిస్తామని చెబుతున్నారు. మరికొందరైతే తమ కుర్చీలు పధిలంగా ఉంటాయో లేదో అని భయపడుతూ మంత్రివర్గ విస్తరణపై పెదవి విరిస్తున్నారు. మంత్రి వర్గ కూర్పుపై నర్మగర్భంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు 151 మందితో పాటు ఆ తర్వాత టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ ఎమ్మెల్యేలు.. వీరితో జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా కేబినెట్ విస్తరణలో చోటు దక్కుతుందని గంపెడాశలో ఎదురు చూస్తున్నారు.

ఇక రాయలసీమ మొదటి నుంచి వైఎస్ఆర్ కుంటుబానికి పెట్టిన కోటలా ఉంది. ఇక్కడ నుంచి కూడా మొదటి కేబినెట్‌లో స్థానం దొరకని ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం వేచిచూస్తున్నారు. మరొక వాదన కూడా ఉంది. ముఖ్యమంత్రే రాయలసీమకు చెందిన వ్యక్తి కాబట్టి ఈ ప్రాంతం ఎమ్మెల్యేలకు కేబినెట్ విస్తరణలో పెద్దగా చోటు కల్పించకపోవచ్చనే ఉహాగానాలు బయలుదేరాయి. అయితే గతంలో జగన్ ఇచ్చిన మాట ప్రకారం ఈ సారి సీమకు జగన్ సముచిత స్థానం కల్పిస్తారనే వాదన కూడా వినిపిస్తోంది. ఒక్క అనంతపురం జిల్లా నుంచే ఏడుగురు ఎమ్మెల్యేలు మంత్రుల రేస్ ఉన్నారంటే పోటీ ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.


అనంతపురం జిల్లా నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో ప్రధానంగా ఐదుగురి పేర్లు వినిపిస్తున్నాయి. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ఐదుగురిలో కూడా సమాజిక సమీకరణలు, అనుభవం ఆధారంగా భర్తీ చేస్తారని జిల్లా వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే జిల్లాలో వీళ్లలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మంత్రి పదవి దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే. వెంకట్రామిరెడ్డి, మాజీ సీఎం వైఎస్‌ఆర్‌, సీఎం జగన్ ఇద్దరితోనూ సన్నిహితంగా ఉంటుందన్నారు. గతంలో వెంకట్రామిరెడ్డి ఎంపీగా పనిచేశారు. గత ఎన్నికల్లో ఆయనను మంత్రిగా చేయాలనే ఉద్దేశంతోనే ఆయనకు ఇష్టం లేకున్నా ఎమ్మెల్యే స్థానం నుంచి జగన్ పోటీ చేయించారని చెబుతున్నారు. ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. జిల్లాలో ఆయన అందరికీ సుపరితుడే కాకుండా వివాదరహితుడని జిల్లా వాసులు చెబుతుంటారు. అందువల్ల ఆయనకు ఈ సారి మంత్రివర్గంలో బెర్త్ ఖాయమని చెబుతున్నారు.


రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి. ఆయన పరిటాల కోటను బద్దలు కొట్టారు. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న పరిటాల సామ్రాజ్యానికి రాజు అయ్యారు. ఈయనకు కూడా జగన్‌తో సన్నిహిత సంబంధాలున్నాయని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పరిటాల కుటుంబాన్ని ఎదుర్కొవాలంటే ఆయనకు మంత్రి పదివి ఇచ్చి రాప్తాడులో అభివృద్ధి పనులుచేసి పరిటాల కుటుంబానికి చెక్ పెట్టాలని జగన్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కాపు రామచంద్రారెడ్డి కూడా సీఎం జగన్ సన్నిహితుడు. మొదటి నుంచి జగన్‌కు అండగా ఉన్నారు. ఈయనకు కూడా మంత్ర పదవి దక్కే అవకాశం ఉంది. ఒక ఎస్సీ కోటలో ఛాన్స్ వస్తే శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఎక్కువ అవకాశాలున్నాయి. పద్మావతి భర్త సాంబశివారెడ్డికి జగన్‌కు మధ్య సన్నిహిత సంబంధాలున్నాయే ప్రచారం కూడా ఉంది. అంతేకాకుండా మహిళా కోటా కింద తనకు ఖాయమని ఆమె లెక్కలు వేసుకుంటున్నారు. గతంలో అయితే ఏ ప్రభుత్వమైనా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మంత్రులను చేశారు. అందుకుభిన్నంగా జగన్ వ్యవహరించారు. మొదటిసారి గెలిచిన శంకర్ నారాయణను మంత్రిని చేశారు. ఇప్పుడు కూడా అలాంటి నిర్ణయమే ఉంటుందా లేదా అనేది ఎదురు చూడాలి. ఎన్నికల టీంను రెడీ చేసుకుంటున్న సీఎం.. అందుకు తగ్గట్టే కేబినెట్ కూర్పు ఉంటుందని చెబుతున్నారు. ఇంత తీవ్రమైన పోటీలో అనంతలో ఎవరికి కిరీటం దక్కుతుందో వేచిచూడాలి.


Tags:    

Similar News