పురుషులంతా 'వియ్ టూ' అనాల‌ట‌!

Update: 2018-10-09 11:25 GMT
ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా మ‌హిళ‌ల‌పై జ‌రుగుతోన్న లైంగిక వేధింపులు - అత్యాచారాలపై `#మీ టూ ` ఉద్య‌మం ఊపందుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ విలక్ష‌ణ న‌టుడు నానాప‌టేక‌ర్ పై న‌టి త‌నూ శ్రీ ద‌త్తా చేసిన ఆరోప‌ణ‌ల‌తో ఈ వ్య‌వ‌హారం మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశ‌మైంది. నానా పటేకర్‌ దగ్గరి నుంచి బీజేపీ ఎంపీ ఎంజే అక్బర్‌ వరకు చాలామందిపై ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో బాధిత మ‌హిళ‌ల‌కు ప‌లువురు పురుషులు, మ‌హిళ‌లు బాస‌ట‌గా నిలుస్తున్నారు. అయితే, ఈ లైంగింక వేధింపుల ఘ‌ట‌న‌లో పురుషులూ బాధితులుగా ఉన్నార‌నే విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. సమాజంలో మహిళలతో పాటు కొంత‌మంది పురుషులూ లైంగిక వేధింపులకు గురవుతున్నార‌ని ప్ర‌ముఖ‌ మహిళా జర్నలిస్ట్‌ సుభుహీ సాఫ్వీ వెల్ల‌డించారు. ప‌ని చేసే చోట కొంత‌మంది పురుషుల‌ను కొంద‌రు మ‌హిళ‌లు వేధించిన ఘ‌ట‌న‌లూ ఉన్నాయ‌ని ఆమె ఓ క‌థ‌నం రాశారు.

కొంద‌రు మగవాళ్లు కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నారని లైంగిక వివక్ష అంశాలపై సాఫ్వీ ఓ ఆర్టిక‌ల్ రాశారు. తన మిత్రుడికి జరిగిన అనుభవాన్ని ఆ ఆర్టిక‌ల్ లో ప్ర‌స్తావించారు. ఓ మీడియాలో లేడీ బాస్‌ దగ్గర త‌న మిత్రుడు పనిచేసేవాడ‌ని, ప్రతి రోజు అత‌డిని ఆమె లైంగికంగా వేధించేద‌ని చెప్పారు. ఆమె లైంగిక వేధింపుల గురించి హెచ్‌ఆర్‌ విభాగానికి త‌న మిత్రుడు ఫిర్యాదు చేశార‌ని చెప్పారు. అయితే, ఇంతకాలం లేడీ బాస్ తో ఎంజాయ్‌ చేసి మోజు తీరిన త‌ర్వాత ఫిర్యాదు చేస్తున్నావా అని ఆ ఫిర్యాదును స్వీకరించలేద‌ని చెప్పార‌ట‌. దీంతో, అతగాడు వేరే మీడియాలో ఉద్యోగం వెతుక్కొని వెళ్లిపోయాడ‌ట‌. ‘#మీ టూ’ ఉద్యమానికి కార‌ణ‌భూత‌మైన హాలీవుడ్‌ నిర్మాత హార్వీ విన్‌స్టైన్ కూడా కోర్టులో ఇదే వాద‌న వినిపిస్తున్నార‌ట‌. డబ్బులు తీసుకొని, ఇష్ట పూర్వకంగానే పడక సుఖంతోపాటు సినిమా అవకాశాలు పొందార‌ని ఆయ‌న కోర్టుకు విన్న‌వించుకుంటున్నార‌ట‌. నాడు నోరు మెద‌ప‌కుండా ఇప్పుడు లేట్‌ వయస్సులో త‌న‌పై అభాండాలు వేస్తున్నారని వాపోతున్నార‌ట‌. అందుకే, లైంగిక వేధింపుల‌కు గురైన మ‌గ‌వారంతా ‘వుయ్‌ టూ’ అని ముందుకు రావాలని సుభుహీ సాఫ్వీ పిలుపునిచ్చారు. మ‌రి, ధైర్యంగా ఎవ‌రైనా ఈ ఉద్య‌మంలో పాల్గొంటారో లేదో వేచి చూడాలి.
Tags:    

Similar News