ఆంధ్రా సంగతి మీకెందుకు వీహెచ్?

Update: 2019-12-20 10:48 GMT
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రయోజనాలు తప్పించి మరింకేమీ తనకు ముఖ్యం కాదని మాట్లాడిన తెలంగాణ కాంగ్రెస్ నేత ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు చూస్తే ఆశ్చర్యం కలిగించకమానదు. ఏపీలోని మూడు రాజధానులు వచ్చినా రావొచ్చన్న మాట చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని తప్పు పడుతున్న వీహెచ్ తీరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రయోజనాలు తప్పించి మరింకేమీ ముఖ్యం కాదన్న వీహెచ్.. అమాంతంగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ పుట్టుకురావటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.

విభజన కారణంగా ఏపీకి జరిగిందన్న వాదన మీద ఇప్పటివరకూ మాట్లాడని వీహెచ్ కు.. ఏపీలో ఒక రాజధాని ఏర్పాటు చేస్తే ఏంది? మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే ఏంది. ఆయన కోరుకున్న తెలంగాణ వచ్చిన తర్వాత.. రాష్ట్రంలోని స్థితిగతుల గురించి.. ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ప్రశ్నించటం మానేసి.. అక్కడెక్కడో ఉన్న ఏపీ గురించి మాట్లాడటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.

ఏపీకి మూడు రాజధానుల కారణంగా నష్టమే తప్పించి లాభం లేదన్న ఆయన.. సీఎం జగన్ నిర్ణయంతో ప్రజాధనం వేస్ట్ అవుతుందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉండగా మూడు రాజధానుల్ని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. నిజంగానే.. ఏపీ మీద వీహెచ్ వారికి ప్రేమ ఉంటే.. ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికి కారణం విభజనే కదా? ఆ విషయాన్ని ఎలా మర్చిపోయినట్లు? ఆ విషయం మీద మాట్లాడకుండా ఏపీలో ఎన్ని రాజధానులు అవసరం? దాని లాభనష్టాల గురించి మాట్లాడటంలో అర్థముందా వీహెచ్ అన్నది ప్రశ్న. అయినా.. పోరాడి సాధించుకున్న తెలంగాణలో పుట్టెడు కష్టాలతో కిందామీదా పడుతుంటే.. వాటి గురించి వదిలేసి.. ఏపీ రాజధానుల గురించి మాట్లాడటం ఏమిటి వీహెచ్?
Tags:    

Similar News