భారత దేశంలో జరిగే ప్రతీ ఎన్నికా ఎన్నో సంకేతాలను సందేశాలను ఇస్తుంది. వాటిని జాగ్రత్తగా గమనించి సరైన స్టెప్స్ తీసుకుంటే ఎంతో కొంత మేలు జరుగుతుంది. తాజాగా చూస్తే గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి 156 సీట్లు దక్కాయి. కాంగ్రెస్ కనాకష్టంగా పదిహేడు సీట్లు గెలిచింది. ఆప్ మధ్యలో దూరి 5 సీట్లు గెలుచుకుంది. భారీ ఎత్తున ఓట్లను కొల్లగొట్టింది.
నిజానికి బీజేపీకి పెద్ద ఎత్తున జనంలో వ్యతిరేకత ఉంటే దాన్ని తనవైపు తిప్పుకుని ఆప్ చేయాల్సిన మేలు బీజేపీకి చేసింది అని అంటున్నారు. అదే విధంగా మజ్లీస్ పార్టీ కూడా పాతిక దాకా సీట్లకు పోటీ పెట్టింది. ఇవన్నీ కలసి గత ఎన్నికలలో 77 దాకా సీట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ ని దారుణంగా ఓడించాయని అంటున్నారు.
ఇపుడు ఏపీ రాజకీయాలను ఒక్కసారి చూద్దాం. ఏపీలో వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ సంగతి ఆ పార్టీ వారికీ తెలుసు. అపోజిషన్ లో తెలుగుదేశం పార్టీ ఉంది. మూడవ పార్టీగా జనసేన ఉంది. అలాగే బీజేపీ కూడా ఏపీలో రాజకీయ వాటా కోసం చూస్తోంది. ఈ నేపధ్యంలో విపక్షాలు విడిగా పోటీ చేస్తే ఓట్లు భారీ ఎత్తున చీలి మరోసారి వైసీపీకి 151 సీట్లు కచ్చితంగా వస్తాయని అంటున్నారు.
దానికి కళ్ళ ముందున్న గుజరాత్ ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని చెబుతున్నారు. గుజరాత్ ఎన్నికల్లో జరిగినది ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు భారీ చీలిక. అది బీజేపీ కావాలని ప్లాన్ చేసిందా లేక అలా జరిగిందా అన్నది పక్కన పెడితే దాని వల్ల భారీగా లబ్ది పొందినది బీజేపీ. ఇపుడు ఏపీలో కూడా వైసీపీ విపక్షాలు అన్నీ విడి విడిగా పోటీ చేయాలని కోరుకుంటోంది.
బీసీల సదస్సులో చంద్రబాబుకు జగన్ ఇదే విషయం మీద సవాల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. నాలుగున్నర దశాబ్దాల అనుభవం ఉంది కదా ఒంటరి పోరుకు ఎందుకు సిద్ధపడరు అంటూ నిలదీశారు. అయితే చంద్రబాబుకు ఆ సంగతి తెలియదా. ఆయన రాజకీయ చాణక్యుడు. ఒంటరిగా పోటీ చేస్తే వైసీపీ వ్యతిరక ఓటు భారీగా చీలుతుంది అని బాబు గట్టిగానే ఆలోచిస్తున్నారు.
ఇక జనసేనకు కూడా ఈ విషయం బాగా అవగాహన ఉంది. అందుకే వైసీపీ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలనివ్వను అని ఆయన చెప్పుకొచ్చారు. అవసరం అయితే పవన్ తన రాజకీయ వ్యూహాలను మార్చుకుని అయినా చివరి నిముషంలో టీడీపీలో కలుస్తారు అని ఇప్పటిదాకా ప్రచారం జరుగుతూ వచ్చింది. ఇపుడు గుజరాత్ ఫలితాలు చూశాక ఇంకా గట్టిగా విపక్షాలు ఒక్కటి అయ్యేందుకు చూస్తాయని అంటున్నారు. ఒక విధంగా ఆప్ రంగ ప్రవేశం, గుజరాత్ లో బీజేపీ ఏడవసారి గెలుపు, పెద్ద సంఖ్యలో ఓట్లూ సీట్లు దక్కించుకోవడం చూసిన వారు అంతా కూడా ఏపీలో ఆ తప్పు చేయకూడదనే జాగ్రత్తపడతారు అని అంటున్నారు.
మరి అదే జరిగితే వైసీపీకి బహు కష్టమే అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఏది ఏమైనా కూడా గుజరాత్ ఫలితాలు ఏపీలో రాజకీయ పక్షాలను ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునేలా చేస్తున్నాయని అంటున్నారు. ఇక ఇదే విధంగా గుజరాత్ గెలిస్తే సరిపోదు, రేపటి రోజున దేశంలో బీజేపీ గెలవాలి. మరి బీజేపీ వ్యతిరేక ఓటు కూడా చీలనివ్వకుండా జాతీయ స్థాయిలో విపక్షాలు కనుక ఒకటి అయితే మాత్రం మోడీకి కూడా షాక్ తప్పదనే అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.