అమెరికాను వణికిస్తున్న మంచు

Update: 2016-01-23 04:28 GMT
అమెరికాకు మంచు కష్టాలు మొదలయ్యాయిక. శీతాకాలంలో భారీగా పడిపోయే ఉష్ణోగ్రతలు.. దట్టంగా పేర్కొనే మంచు మామూలే. అయితే.. ఈసారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. అమెరికాలోని ఆరు రాష్ట్రాల్లో మంచు కష్టాలు తీవ్రమయ్యాయి. భారీగా మంచుకురవటంతో దేశ రాజధాని వాషింగ్టన్ డీసీతో పాటు.. నార్త్ కరోలినా.. వర్జీనియా.. మేరీలాండ్.. టెన్నెసీ.. పెన్సిల్వేనియాలో మంచు ఉత్పాతం విశ్వరూపం చూపిస్తోంది.

భారీగా కురుస్తున్న మంచుతో అక్కడి వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే.. ఈ ఆరు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా ప్రతిచోటా భారీగా మంచు మేటలు వేయటంతో.. ఈ ఆరు రాష్ట్రాల్లో మంచు దుప్పటి కమ్మేసినట్లైంది. దీంతో.. ఇల్లు.. వాకిలి అన్న తేడా లేకుండా మొత్తంగా మంచు కప్పేసింది. దీంతో.. రోజువారీ కార్యకలపాలు కొనసాగించటం కష్టంగా మారింది.

విమానాశ్రయాల్లో పెద్దఎత్తున పేరుకుపోయిన మంచుతో విమాన సర్వీసులకు ఆటంకంగా మారుతున్నాయి. ఇక.. రోజువారీ కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలిగించేలా పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో.. అమెరికాలోని ఈ ఆరు రాష్ట్రాల ప్రజలకు మంచు నరకం కనిపిస్తున్న పరిస్థితి.
Tags:    

Similar News