భాగ్యనగరంలో మరో కారు భీభత్సం

Update: 2017-05-13 10:28 GMT
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కొడుకు నిషిత్ మితి మీరిన వేగంతో కారు నడిపి తన స్నేహితుడితో పాటు ప్రాణాలు కోల్పోయిన ఘటన జరిగిన రెండు రోజులు కాలేదు. ఈ లోపే హైదరాబాద్ లోని కావూరి హిల్స్ ప్రాంతంలో ఓ కారు ఇదే రీతిలో భీభత్సం సృష్టించింది. అతి వేగంతో కారు నడిపిన ఓ యువతి ఆ ప్రాంతంలో అలజడి రేకెత్తించింది. అదృష్టవశాత్తూ ఆ అమ్మాయి ప్రాణం పోలేదు కానీ.. ఆమె కారు సృష్టించిన భీభత్సానికి ఆ ఏరియాలో కలకలం రేగింది.

మితిమీరిన వేగంతో రాంగ్‌ రూట్లో వచ్చిన  ఓ యువతి  తన మినీ కూపర్‌ కారుతో వెనుక నుంచి ఓ  టాటా సఫారీ కారును వేగంగా ఢీకొట్టింది. అయితే సమయానికి ఎయిర్‌ బ్యాగులు తెరుచుకోవడంతో కారులో ప్రయాణిస్తున్న యువతికి ప్రాణాపాయం తప్పింది. అనివారం తెల్లవారుజామున నాలుగున్నర ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సఫారీని గుద్దిన వేగానికి ఆ యువతి ప్రయాణిస్తున్న కారు ముందు భాగమంతా నుజ్జు నుజ్జయింది. ఆ యువతి ఓ బర్త్ డే పార్టీలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. యాక్సిడెంట్ అవగానే యువతి కారును వదిలేసి అదృశ్యమైంది. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి ఆచూకీ కోసం సీసీ టీవీ ఫుటేజ్‌ ద్వారా గాలిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News