ఈ ఫేస్ బుక్ ఫ్రెండ్‌ కి వ‌చ్చిన ఐడియా అదిరింది

Update: 2017-06-18 06:59 GMT
ఇవాల్టి రోజున ఫేస్ బుక్  అకౌంట్ లేనోళ్లు చాలా చాలా త‌క్కువ మంది ఉంటారు. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ఫేస్ బుక్ ను అంద‌రూ వినియోగించేవారే. అయితే.. వంద‌ల కోట్ల మంది ఫేస్ బుక్ వినియోగ‌దారులు ఉన్నా.. ఎవ‌రికి రాని ఒక ఐడియా ఒకామెకు వ‌చ్చేసింది. అంతే.. త‌న‌కొచ్చిన ఐడియాను అమ‌లు చేసేసింది.

ఆమె చేసిన ప‌ని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంత‌కీ ఆమె ఏం చేసింది? ఆమెకు వ‌చ్చిన ఐడియా ఏమిటంటే.. మీ ఫేస్ బుక్ అకౌంట్‌ లో మీకు ఫ్రెండ్స్ ఎంత‌మంది అంటే? క్ష‌ణంలో మీరు స‌మాధానం చెప్పేస్తారు.

మ‌రి.. వీరిలో నువ్వు ఎంత‌మంది స్నేహితుల్ని ఒక్క‌సారి అయినా క‌లిశావా? అంటే తెల్ల‌ముఖం వేయాల్సిందే. స‌రిగ్గా ఇలాంటి ఆలోచ‌నే తంజా హాలాండ‌ర్ అనే అర్టిస్ట్‌ కు వ‌చ్చింది.  ఆమె ఎంత మాత్రం ఆల‌స్యం చేయ‌లేదు. త‌న ఫేస్‌ బుక్ లో ఉన్న ఫ్రెండ్స్‌ ను క‌ల‌వాల‌ని డిసైడ్ అయ్యింది.

ఆమె ఫేస్ బుక్ పేజీలో 623 మంది స్నేహితులు ఉన్నారు. వారంద‌రిని క‌ల‌వాల‌ని నిర్ణ‌యించుకుంది. త‌న ఆలోచ‌న‌ను వెంట‌నే కార్య‌రూపంలో పెట్టేసిన ఆమె.. ఆర్ యు రియ‌ల్లీ మై ఫ్రెండ్ అనే పేరు పెట్టుకొని త‌న అకౌంట్లో ఉన్న స్నేహితులంద‌రిని క‌లిసే పని మొద‌లెట్టింది. 2010 జ‌న‌వ‌రి ఒక‌టిన త‌న యాత్ర‌ను ప్రారంభించింది.

త‌న అకౌంట్లో ఉన్న వారిని ఒక్కొక్క‌రిగా క‌లుస్తూ.. వారితో స‌ర‌దాగా గ‌డిపిన క్ష‌ణాల్ని ఫోటోలుగా తీసుకొని.. త‌న ఫేస్ బుక్ అకౌంట్లో పోస్ట్ చేసేది. నెల‌లో స‌గ‌టున రెండు వారాలు త‌న ప్ర‌యాణానికి స‌మ‌యాన్ని కేటాయించింది. ఇలా త‌న అకౌంట్లో ఉన్న 623 మందిని ఆమె క‌లిసేసింది. కొన్ని నెల‌ల క్రితం ఆమె త‌న ప్ర‌యాణాన్ని ముగించింది. ఫేస్ బుక్ ఫ్రెండ్స్‌ను క‌లుసుకునే ప‌నిలో భాగంగా ఆమె నాలుగు ఖండాలు.. 12 దేశాలు 43 అమెరికా రాష్ట్రాల్లో ప్ర‌యాణించింది. ఇంత‌కీ.. ఇలాంటి ఐడియా మీకు ఎప్పుడైనా వ‌చ్చిందా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News