అబూసలేం కోసం ఆ అమ్మాయి ఆత్మహత్య

Update: 2015-06-29 08:53 GMT
ఇండియాలో గ్యాంగ్ స్టర్లు, మాఫియా డాన్లంటే మగువలు మనసు పడుతున్నట్లున్నారు. దావూద్ ఇబ్రహీం, అబుసలేం, ఛార్లెస్ శోభరాజ్ ల కోసం సినీతారలు, ఇతర రంగాలవారు పెళ్లాడాలని కోరుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మోనికా బేడీని పెళ్లాడిన గ్యాంగ్ స్టర్ అబూ సలేంను పెళ్లి చేసుకుంటానని, అందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ 26 ఏళ్ల ఓ మహిళ స్పెషల్ టాడా కోర్టును ఆశ్రయించింది. ముంబై సీరియల్ బ్లాస్ట్ కేసులో నిందితుడిగా ఉన్న సలేం ప్రస్తుతం జైలులో ఉన్నాడు. అబూ సలేంను పెళ్లి చేసుకునేందుకు అనుమతి కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేసిందని ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. మహారాష్ట్రలోని మంబ్రా పట్టణానికి చెందిన సయ్యద్ కౌసర్ అనే ఈ యువతి కామర్స్ లో డిగ్రీ చదువుకుంది.

 కౌసర్ ను అబూసలేం వివాహం చేసుకున్నట్టు గతంలో ముంబై సిటీ టాబ్లాయిడ్ ఓ వార్త ప్రచురించడంతో పోలీసులు తన గురించి విచారణ చేశారని సదరు మహిళ పిటిషన్లో పేర్కొంది. అబూ సలేంతో ఆమె ఉన్న ఫోటోను పలువురికి చూపించి వివరాలు సేకరించారని.. దాంతో తనను ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదని తెలిపింది.... అందుకే అబూ సలేంను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. కాగా, నిరుడు కోర్టు విచారణ నిమిత్తం లక్నో పోలీసులు సలేంను రైలులో తీసుకు వెళ్తున్న సమయంలో ఫోన్ ద్వారా ఓ మహిళను పెళ్లి చేసుకున్నట్లు వార్త వచ్చింది. దానిని పరిశీలించిన టాడా కోర్టు ఈ విషయమై విచారణ జరపాలని పోలీసులను ఆదేశించింది. అయితే, తనకు పెళ్లి కాలేదని అబూ సలేం చెబుతున్నాడు. కాగా అబూసలేం తనను పెళ్లాడకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆ యువతి మొండికేస్తోంది.
Tags:    

Similar News