నిజంగా జరిగాయా? అనిపిస్తాయి కొన్ని ఘటనలు వింటే. ఒళ్లు జలదరించటమే కాదు.. ఒక్కసారి తలుచుకుంటే.. మనసంతా చేదుగా మారిపోతుంది. ఒక భూవివాదంలో న్యాయం కోసం పోరాడిన ఒక మహిళను కలలో కూడా ఊహించని రీతిలో హింసించిన రాక్షసుల ఉదంతం వింటే ఒళ్లు రగిలిపోవటమే కాదు.. ఇలాంటి దుర్మార్గులకు ఎలాంటి శిక్ష విధించినా తక్కువేనన్న భావన కలుగుతుంది.
ఉత్తరప్రదేశ్ కు చెందిన రాయ్ బరేలికి చెందిన 46 ఏళ్ల మహిళ చేసిన తప్పు ఏమైనా ఉందంటే.. భూవివాదంలో న్యాయం కోసం పోరాడటం మాత్రమే. తమ మీద ధైర్యంగా చట్టబద్ధమైన పోరాటం చేయటం నచ్చని ఠాకూర్ యువకుల ముఠా ఒకటి ఆమెపై 2008లో సామూహిక అత్యాచారాన్ని చేశారు. దీనిపై న్యాయపోరాటం చేసి ఆమె ధైర్యాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు.
న్యాయం కోసం పోరాడిన ఆమె పోరాటంతో ఆ నిందితులు జైలుపాలయ్యారు. దీంతో.. కక్ష కట్టిన వారు.. ఆమెపై 2011..2010.. 2013లలో వరుస యాసిడ్ దాడులకు పాల్పడ్డారు. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో న్యాయం కోసం పోరాడుతూ.. నిందితులకు చట్టప్రకారం శిక్ష పడేలా ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో యాసిడ్ దాడులకు గురైన బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఒక సంస్థలో ఆమె పని చేస్తున్నారు. ఇలాంటి వేళ.. ఆమె మరో దారుణమైన అనుభవాన్ని ఎదుర్కొంది.
ఆమెపై అత్యాచారం చేసి..యాసిడ్ దాడి చేసిన కేసు కోర్టులో విచారణకు వస్తున్న వేళ.. నిందితులు బరితెగించి.. ట్రైన్లో వెళ్తున్న ఆమెపై పాశవిక దాడికి దిగారు. బలవంతంగా నోరు తెరిచి.. నోట్లో యాసిడ్ పోసేశారు. తీవ్రమైన బాధతో విలవిలలాడుతున్న ఆమె గొంతు.. శరీర భాగాలు కాలిపోయి నరకయాతన పడుతోంది. తానిక బతకలేనని.. చచ్చిపోతానని వేడుకొంటోంది. గొంతు అంతా కాలిపోయి మాట రాక.. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆమె.. తనకు జరిగిన అన్యాయాన్ని చెబుతున్న వైనం చూసిన వారంతా కదిలిపోతున్నారు. ఇంత పాశవిక దాడికి పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/